ట్రంప్ రాక‌.. మీడియాకు కాసుల వ‌ర్షం కురిసిందిగా…!

-

భార‌త్ చిర‌కాల మిత్ర దేశం అమెరికా. రెండు దేశాలూ .. జ‌నాభాలో కాక‌పోయినా.. ప్ర‌జాస్వామ్యంగా చూసిన ప్పుడు రెండూ పెద్ద దేశాలే. అమెరికాలో నాలుగేళ్ల‌కు, భార‌త్‌లో ఐదేళ్ల‌కు పాల‌కుల‌ను ప్ర‌జ‌లే ఎన్నుకుం టారు. అలాంటి రెండు దేశాల మ‌ధ్య అనేక విష‌యాల్లో సంబంధ బాంధ‌వ్యాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డి పాల‌కులు.. అక్క‌డికి.. అక్క‌డి పాల‌కులు ఇక్క‌డికి వ‌స్తుంటారు. ప‌ర్య‌ట‌న‌లు నిర్వ‌హిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే 1968 నుంచి కూడా భార‌త్‌-అమెరికా దేశాధినేత‌ల మ‌ధ్య రాక‌పోక‌లు సాగుతున్నాయి

ఈ క్ర‌మంలోనే అనేక ఒప్పందాలు కూడా జ‌రుగుతున్నాయి. తాజాగా అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌.. భార‌త్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే, ఇక్క‌డ ఓ విశేషం ఉంది. ఆయ‌న రాక‌తో.. దేశానికి అనేక రూపాల్లో ప్ర‌యోజ‌నా లు ఉన్నాయ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. వాణిజ్య ఒప్పందాలు, వ్యాపార ఒప్పందాలు ఇత‌ర‌త్రా అనేక ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని తెలిపింది. అయితే, వీట‌న్నింటికీ భిన్నంగా ట్రంప్ భార‌త్ ప‌ర్య‌ట‌న‌తో ఇన్‌స్టెంట్‌గా ల‌బ్ధి ఎవ‌రైనా పొందారంటే.. అవి ఈ దేశంలోని మీడియా సంస్థ‌లే అని చెబుతున్నారు విశ్లేష‌కులు.

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ రాక‌ను ప్ర‌స్టేజ్‌గా భావిస్తున్న ప్ర‌ధాని మోడీ ఆయ‌న భార‌త్‌ల అడుగు పెట్టిన ద‌గ్గ‌ర నుంచి తిరిగి అమెరికా విమానం ఎక్కేవ‌ర‌కు కూడా ప్ర‌తి పాయింట్‌ను లైవ్ టెలికాస్ట్ చేసేందుకు దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ మీడియాల‌తో అవ‌గాహ‌న వ‌చ్చారు. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని చానెళ్లు కూడా ట్రంప్ ప‌ర్య‌ట‌న‌ను లైవ్ ఇచ్చాయి. ఇస్తున్నాయి.

మొత్తంగా భారీ ఎత్తున కేంద్రం ఈ మీడియా సంస్థ‌ల‌కు కాసులు కురిపించ‌నుంద‌ని అంటున్నారు. ఆయా మీడియా చానెళ్ల టారిఫ్‌ల‌ను రేటింగ్‌ల‌ను బ‌ట్టి.. కేంద్ర‌మే వీటికి యాడ్ రుసుల కింద చెల్లించ‌నుంద‌న్న‌మాట‌. దీంతో ఆర్థిక మంద‌గ‌మ‌నంలో చిక్కుకున్న మీడియాకు ట్రంప్ రాక ఒకింత ఊపిరి ఊదిన‌ట్ట‌యింద‌న్న‌మాట‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version