ఆర్టీసి మెట్టు దిగడానికి కారణం ఏంటి…? కెసిఆర్ వెనక్కి తగ్గుతారా…?

-

తెలంగాణాలో ఆర్టీసి సమ్మె 40 రోజులు దాటింది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి వారి డిమాండ్లు పరిష్కరిస్తాం అనే ఒక్క ప్రకటన అంటే ఒక్కటి కూడా రాలేదు. హైకోర్ట్ లో దీనిపై వాదనలు నడుస్తున్నాయి గాని ఎక్కడా కూడా ఒక కొలిక్కి వచ్చే సంకేతాలు కూడా కనపడటం లేదు. ఈ నేపధ్యంలో ఆర్టీసి జెఎసి కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్ళు ఏ డిమాండ్ మీద అయితే సమ్మెను ఉదృతంగా తీసుకువెళ్ళారో ఆ కీలక డిమాండ్ విషయంలోనే ఆర్టీసి పక్కకు జరిగింది. విలీనం విషయాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నామని పేర్కొంది.

ఈ ప్రకటన చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు… అసలు దీని వెనుక ఉన్న కారణం ఏంటి అనే దానిపై ఆరా తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. విలీనం అనేది ఇప్పటికిప్పుడు జరిగే ప్రక్రియ కాదు ఇది ఒక సాధ్యం కాని కోరిక అనే అభిప్రాయం కార్మికుల్లో వినపడిందని కొందరు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చేసారు కదా మాకు ఎందుకు చేయరని ఆర్టీసి ఒకరకంగా పట్టుబట్టింది… కాని ఆంధ్రప్రదేశ్ లో కమిటీ వేసారు గాని విలీనం జరగలేదు. ఇదే విషయంపై కార్మికుల్లో చర్చ జరగడం, జెఎసి కి చెప్పడంతో వెనక్కు తగ్గారు అనేది ఒక కారణంగా చెప్తే…

ఇక మరో కారణం విషయానికి వస్తే… తనతో కలిసి తెలంగాణా ఉద్యమం చేసిన అశ్వత్దామ రెడ్డి ఈ ఉద్యమాన్ని నడిపించడంతోనే కెసిఆర్ వెనక్కు తగ్గడం లేదనే అభిప్రాయం కార్మికుల్లో వ్యక్తమైంది… ఇది ఎన్నాళ్ళు సాగినా ఇలాగే సాగుతుంది మినహా ప్రయోజనం లేదనే భావనకు వాళ్ళు వచ్చి ఆర్టీసి కార్మికులు జెఎసికి చెప్పారని అంటున్నారు. ఇకపోతే కార్మికుల ఆత్మహత్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు కాబట్టి వాళ్ళే వెనక్కు తగ్గిస్తే ప్రస్తుతం విధుల్లోకి చేరితే జీతాలు అయినా వస్తాయి అని చాలా మంది కార్మికులు అభిప్రాయపడుతున్నారట. అందుకే అలాంటి కీలక డిమాండ్ ని జేఎసి పక్కన పెట్టిందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version