జబర్దస్త్ షో నుండి నాగబాబు అవుట్….??

-

ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారం అవుతున్న క్రేజీ షోల్లో జబర్దస్త్ షో కూడా ఒకటి. కొన్నేళ్లుగా ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న ఈ షోకు వీక్షకులు నుండి బ్రహ్మాండమైన రేటింగులు వస్తుంటాయి. ఇక ఈ షోకు ఎప్పటినుండో జడ్జీలుగా వ్యవహరిస్తున్న నాగబాబు మరియు రోజాలకు కూడా మెల్లగా మంచి క్రేజ్ ఏర్పడింది. వారిద్దరూ స్వతహాగా సినిమా నటులు అయినప్పటికీ, ఈ షో వారికి మరింత పాపులారిటీ తెచ్చిపెట్టింది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం,
ఈ షో నుండి త్వరలో నాగబాబు బయటకు వెళ్లిపోనున్నారు అనే వార్తలు ఒకింత గట్టిగా వినపడుతున్నాయి. అయితే దీనికి ఒక ముఖ్య కారణం ఉందట, అదేమిటంటే ఈ షోలో చమ్మక్ చంద్ర టీమ్ కోసం పనిచేసే షో కోఆర్డినేటర్ ఒకరు, అతి త్వరలో మరొక తెలుగు ఛానల్ లో ఒక సరికొత్త కామెడీ షోని ప్రారంభించనున్నారని, అయితే ఆ షోకు చమ్మక్ చంద్రతో పాటు అతనికి ఎంతో మంచి సాన్నిహిత్యం ఉన్న నాగబాబు గారిని కూడా తీసుకోవాలని భావిస్తున్నాడట. అంతేకాక ఇటీవల ఈ విషయమై నాగబాబు గారిని సంప్రదించగా, ఆయన కూడా కొంత సుముఖత వ్యక్తం చేసినట్లు టాక్.
ఇకపోతే ఈ మొత్తం విషయం చివరికి జబర్దస్త్ షో నిర్వాహకులకు చేరడంతో, వారు వెంటనే అలెర్ట్ అయి, ఇకపై తమ షోలో పని చేసేవారు తమకు కొన్నాళ్లపాటు తమతోనే పని చేసేలా అగ్రిమెంట్ రాసివ్వాలి అనే నిబంధన పెట్టడం, అందరితోపాటు నాగబాబు గారిని కూడా అగ్రిమెంట్ రాసివ్వమని అడగడం జరిగిందట. అయితే ఆ ఘటనతో కొంత కలత చెందిన నాగబాబు గారు, షో నుండి బయటకు వెళ్లేందుకు నిర్ణయించినట్లు సమాచారం. అయితే నేటి ఉదయం నుండి పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తపై పూర్తి నిజానిజాలు మాత్రం వెలువడాల్సి ఉంది…..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version