సుజనా-సాయి రెడ్డిల ట్వీట్టర్ వార్..! గరం గరం..ఏపీ రాజకీయం..!

-

twitter war between mp vijayasai reddy and mp sujana choudary
twitter war between mp vijayasai reddy and mp sujana choudary

మంగళవారం హైదారాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో నిమ్మగడ్డ రమేశ్ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సుజనా చౌదరీలు సమావేశం అయ్యారు. ఇక వారు ముగ్గురు సీక్రెట్ గా సంవేశం అవ్వడంతో ఆ విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన ట్విటర్ ఖాతా ద్వారా ఈ సమావేశానికి బాబే కారణం అని ఆ సమావేశంలో ఉన్న వాళ్ళు దుష్ట చతుష్టయం అని వ్యంగ్యాస్త్రాలు వల్లించాడు. దాంతో ఈ విషయం ఒక్కసారిగా చర్చనీయాంశం అయ్యింది. ఇక ఈ విషయం వైసీపీ బీజేపీ పార్టీ వర్గాల మధ్య మాటల యుద్ధానికి తావు తీసింది.

విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ సుజనా చౌదరీ తన ట్విటర్ ద్వారా ట్వీట్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, కామినేని శ్రీనివాస్ గారు పార్క్ హయత్ లోని నా కార్యాలయానికి వచ్చినందుకే నానా హైరానా పడుతున్నారు. మేం కలిస్తే తప్పేంటి? మీకు అంత భయం దేనికి? కంగారొద్దు. నా రాజకీయాలు పారదర్శకంగా వుంటాయి. నేనేదైనా చెప్పే చేస్తా.. అంటూ నిష్కలంగా ట్వీట్ చేశారు.

అంతలోనే మరో ట్వీట్ కూడా చేశారు ఈ ట్వీట్ లో ఆయన మాట్లాడుతూ.. రమేష్ కుమార్ ని ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగిస్తున్నామని మీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేస్తుంది. రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా వుండి ఎంపిని కలవడంలో మతలబేంటని మీ సాక్షి మీడియా ఆశ్చర్యపోతుంది. ఇంతకీ ఆయన్ను మీరు కమిషనర్ గా గుర్తించారా? కోర్టు ఉత్తర్వులు అమలు చేస్తున్నారా? అంటూ మరో ట్వీట్ చేశాడు..

Read more RELATED
Recommended to you

Exit mobile version