ఆత్మహత్య చేసుకున్న సర్పంచ్..! సూసైడ్ నోట్ లో….

-

vikarabad sarpanch hanged himself writes a note
vikarabad sarpanch hanged himself writes a note

తెలంగాణ రాష్ట్రం లోని వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని పూడూరు మండలం కొత్త పల్లి సప్రఞ్చ్ ఆనంద్ నేడు ఉదయం తన ఇంట్లో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తుండగా వారికి ఆత్మహత్య చేసుకున్న గదిలో సూసైడ్ నోట్ కనపడింది. సూసైడ్ నోట్ లో ఆనంద్ తన చావుకి ఎవ్వరూ కారణం కాదని పేర్కొన్నాడు, తాను గత రెండు నెలలుగా ఎంతో బాధ పడుతున్నానని మానసికంగా శారీరకంగా ఎంతో క్షోభకు గురవుతున్నానని ఆయన రాశాడు. తన ఇంట్లోని వాళ్ళు బంధువులు తనకి ఎంతగానో సహాయపడ్డారని వారి కారణంగానే ఇంతకాలం బ్రతికి ఉన్నానని ఆయన ఆ లేఖ లో రాశాడు. తను తన మిత్రులకి ఎంతగానో బాధ కలిగించాడని ఆ లేఖ లో పేర్కొన్నాడు. తనకి ఇప్పటికీ మరణించాలని లేదని కానీ అలా జీవచ్ఛవంగా బ్రతకాలని కూడా లేదని ఆ లేఖ లో పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version