వెనక్కి తగ్గనున్న ఉద్ధవ్ … విమర్శల దెబ్బకి దార్లోకి వచ్చిన సి‌ఎం !

-

దేశంలో అత్యధికంగా కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర ముందు నుండి వార్తల్లో నిలుస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఉద్ధవ్ థాక్రే మొట్టమొదటి సారి ముఖ్యమంత్రి కావటం తో, అనుభవం లేకపోవడంతో, కరోనా వైరస్ కట్టడి చేయటానికి తీసుకుంటున్న నిర్ణయాలు విఫలం అవుతున్నట్లు విమర్శలు గట్టిగా వస్తున్నాయి. మరోపక్క కేంద్రం కూడా మహారాష్ట్రలో ఉన్న పరిస్థితి నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య గమనిస్తూ ఆందోళన చెందుతోంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల విషయంలో ఐదువేల చేరువలో మహారాష్ట్ర ఉంది.ఈ విషయం నడుస్తూ ఉండగానే  ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే లాక్ డౌన్ లో మినహాయింపుల ఇస్తూ  సడలింపులు ఇటీవల ఇవ్వటంతో ఒక్కసారిగా విమర్శలు ప్రజలలోను మరియు నాయకుల లోనూ వచ్చాయి. రాష్ట్రంలో పరిశ్రమలు పునరుద్ధరించడానికి ప్రజల ప్రాణాలను లెక్కచేయకుండా ఉద్దవ్ థాక్రే వ్యవహరిస్తున్నారని చాలా మంది విమర్శలు చేస్తున్నారు. అసలే దేశం ఆర్థికంగా భయంకరంగా కష్టాల్లో ఉంది. దేశ ఆర్థిక రాజధానికి వెన్నెముక ముంబాయి. దేశ ఆర్థిక రాజధాని కలిగిన ఈ రాష్ట్రంలో ఇటువంటి చర్యలు చేపడితే దేశం వల్లకాడు అవుతుందని అందరూ అంటున్నారు. ఆర్థికంగా భయంకరంగా నష్టపోయే అవకాశం ఉందని విమర్శలు దేశవ్యాప్తంగా వస్తున్నాయి.

 

ఈ విషయంలో సొంత పార్టీ నేతల నుండి కూడా అభ్యంతరం వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి ఈ వ్యవహారం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడం తో విమర్శల దెబ్బకి లాక్ డౌన్ లో మినహాయింపుల విషయంలో ఉద్దవ్ థాక్రే వెనక్కి తగ్గనున్నారట. దీంతో తాజాగా ఈ అంశంపై మంత్రివర్గం సమావేశం ఉద్దవ్ థాక్రే ఏర్పాటు చేశారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version