పని చేయాలనే సంకల్పం.. ప్రజలకు మేలు చేయాలనే తలంపు ఉంటే చాలు .. రాజకీయాల్లో గుర్తింపు ఆటోమేటిక్‌గా అదే లభిస్తుంది.. అనడానికి ఉక్కు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ సమన్వయకర్తగా ఉన్న ప్రవీణ్‌కుమార్‌రెడ్డి.. ఆది నుంచి కూడా దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరు. ప్రజలకు మేలు చేసే ప్రతి కార్యక్రమాన్నీ ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. తాను నడుస్తూ.. కార్యకర్తలను ముందుకు నడిపించడంలోనూ ఆయన ముందుంటారు. ఈ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆయన వెనుదిరిగి చూసుకున్నదే లేదు. ప్రధానంగా జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి జరగాలనే సత్సంకల్పంతో ప్రవీణ్ ముందుకు సాగుతున్నారు.
రాయలసీమలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల కారణంగా ఇక్కడ ఉపాధిలేక వేలాది మంది పొరుగు రాష్ట్రాలకు వలసపోతున్నారు. అదే సమయంలో విదేశాలకు కూడా వెళ్లి అగచాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పని కల్పిస్తే.. వారంతా ఇక్కడే పనిచేసుకుని ఇటు వారు.. అటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని భావించిన ప్రవీణ్ కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం పరితపించారు. ఈ క్రమంలోనే ఆయన ఉద్యమానికి పావులు కదిపారు. ఇది ఆయనను జిల్లాలోనే నెంబర్ వన్ నాయకుడిగా నిలబెట్టింది. ఈ క్రమంలోనే ఆయన పేరులో ఉక్కు చేరిపోయి.. ఉక్కు ప్రవీణ్కుమార్రెడ్డిగా మారిపోయింది.ఈ క్రమంలో ప్రవీణ్.. అనేకానేక ఉద్యమాలు చేశారు.
యువ నాయకుడు కావడంతో యువతను ప్రధానంగా టార్గెట్‌గా చేసుకుని ఆయన కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. దీనికి పార్టీ కూడా సహకారం అందించింది. ఉక్కు ఫ్యాక్టరీ కోసం ప్రవీణ్ రెడ్డి చేసిన పోరాటం జిల్లాలోనే సంచలనమైంది. ఈ క్రమంలోనే చంద్రబాబు గత ఎన్నికల తర్వాత అనాథలా ఉన్న ప్రొద్దుటూరు టీడీపీ పగ్గాలు అప్పగించగా నియోజకర్గంలో టీడీపీ కేడర్‌కు, ప్రజలకు తాను నమ్మకమైన నేత అన్న ధైర్యం ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఇక్కడ గెలిపించాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కడప పార్లమెంటు జిల్లా ఇంచార్జ్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన లింగారెడ్డితో సమన్వయం చేసుకుని ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వంపై ఒకవైపు పోరాటాలు చేస్తూనే.. మరోవైపు పార్టీ పునాదులు బలపరిచేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇది పార్టీలో జోష్ పెంచడంతోపాటు.. వ్యక్తిగతంగా కూడా ప్రవీణ్‌కు మంచి గుర్తింపు లభించేలా చేస్తుండడం గమనార్హం. ఇదే దూకుడు కొనసాగితే.. వచ్చే ఎన్నికల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పార్టీ బలంగా తయారవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.