రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సాక్ష్యాత్తు ప్రధాని మోడీయే పలు సార్లు పార్లమెంట్ వేధికగా అన్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అయినా.. రాష్ట్ర పార్టీలకు ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రశ్నించేందుకు భయపడుతున్నారని విమర్శించారు. పార్లమెంట్ లో ప్రధాని మోడీ ఆంధ్ర ప్రదేశ్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ లో చర్చలు జరపాలని కోరాలని రాష్ట్ర పార్టీలకు సూచించారు. ప్రధాన మంత్రి మోడీ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ లో చర్చలు జరిపితే.. ఏపీ కాస్త అయినా లాభం జరుగుతుందని అన్నారు.
అలాగే ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం జరిగిందని దేశం మొత్తం కూడా తెలుస్తుందని అన్నారు. రాష్ట్ర పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ లో మౌనంగా ఉంటే రాష్ట్రం లో ముందు తరాలకు మనమే అన్యాయం చేసిన వాళ్లం అవుతామని అన్నారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం చేసిన వాళ్లే.. అన్యాయం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ కు ఏం చేసినా.. అడిగే వాడు లేరని అనుకుంటారని అన్నారు. రాష్ట్ర పార్టీల ఎంపీలు పార్లమెంట్ లో అన్యాయం గురించి గళం వినిపించాలని సూచించారు.