ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీని ఎదుర్కొనడానికి రాష్ట్రంలో ఉన్న ప్రముఖ పార్టీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీ తో కలిసి రాబోయే సార్వత్రిక ఎన్నికలను టార్గెట్ గా చేసుకుని వేస్తున్న రాజకీయ అడుగులు ఇప్పుడు ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ పై మూడ రాజధానుల విషయంలో జగన్ అసెంబ్లీలో చెప్పిన అభిప్రాయం మరియు అదే విధంగా అమరావతి ప్రాంతంలో రైతుల ఆందోళనలు చాలా గట్టిగా జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత వచ్చే విధంగా చేస్తున్న తరుణంలో స్థానిక ఎన్నికలు ముంచుకు రావడంతో జగన్ కి అనుకోని తలనొప్పి వచ్చినట్లయింది అని చాలామంది ఏపీ లో ఉన్న సీనియర్ నేతలు కామెంట్ చేస్తున్నారు.
ఇటువంటి తరుణంలో పార్టీలో జగన్ తర్వాత పెద్దగా ఉండే విజయసాయిరెడ్డి …స్థానిక సంస్థల ఎన్నికలను డీల్ చేస్తా సార్ ” అంటూ విజయసాయి రెడ్డి రంగంలోకి దిగినట్లు వైసిపి పార్టీలో వినబడుతున్న టాక్. దీంతో ఇప్పటి నుండి ఢిల్లీలో కాక రాష్ట్రంలోనే విజయసాయిరెడ్డి మకాం వేయనున్నట్లు రాష్ట్రంలో ఉన్న వైసీపీ క్యాడర్ నీ స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ చేయనున్నట్లు సమాచారం.