పవన్ కళ్యాణ్ దారిలోనే విజయ్ వెళ్తారా..? సక్సెస్ త్వరగా వస్తుందా..?

-

ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్‌ ఓ సంచలనం.. సీని రంగంలో నెంబర్ వన్ హీరోగా ఉన్న ఆయన.. రాజకీయాల వైపు అడుగులు వేశారు.. 2014 మార్చిలో జనసేనను స్థాపించారు.. 2019లో జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైంది ఆ పార్టీ.. పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి చవిచూశారు.. 2024లో జరిగిన ఎన్నికల్లో పొత్తులో భాగంగా 21 సీట్లో పోటీ చేసి.. అన్ని స్తానాల్లో విజయకేతనం ఎగురవేశారు.. అయితే తమిళనాడు రాజకీయాల్లో హీరో విజయ్ కూడా పార్టీ స్థాపించారు..

దేశ రాజకీయాల్లో ఉండే చాలా మంది సీని రంగం నుంచి వచ్చిన వారే ఉంటారు.. పార్టీ స్థాపించి.. ప్రజల్లోకి వెళ్తుంటారు.. తెలుగులో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు ఉంటే.. తమిళనాడులో కాస్త ఎక్కువ ఈ వాతావరణం మనకు కనబడుతుంది. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, విజయ్ కాంత్, కమల్ హాసన్ రాజకీయ పార్టీలను ఏర్పాటు చేశారు. ఇటీవలే తమిళ నటుడు విజయ్ కూడా ఇటీవల రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఒక అడుగు ముందుకేసి, పార్టీ పేరు, పార్టీ థీమ్ వీడియో కూడా విడుదల చేశారు.

పార్టీ జెండాలో జంట ఏనుగులు ఉండేలా జెండాను రూపొందించిన ఆయన.. తమిళగ వెట్రిక్ కలగం అంటూ తన పార్టీ పేరు ప్రకటించారు.. 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా ఆయన పార్టీని ప్రకటించినట్లు సభలో వెల్లడించారు..అందుకు తగ్గట్లుగానే రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతున్నారు.. పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు.. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ లాంటి నాయకులను ఎదుర్కొని పార్టీని నడపడం అంటే కష్టసాధ్యమైనదే కానీ.. విజయ్ మాత్రం ఎక్కడా వెనుకడుగు వెయ్యడం లేదు.. మహానాడు పేరుతో బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసి.. తమిళ ప్రజలకు తన ఉద్దేశ్యాన్ని స్పష్టంగా చెప్పారు..

తమిళనాడు రాజకీయాల్లో డిఫరెంట్ గా ఉంటాయి.. తమిళ సంస్కృతి ఉట్టిపడేలా, తమిళ వాసన చెరిగిపోకుండా పార్టీలు స్థాపించి.. ప్రజల్లోకి వెళ్తే అక్కడి ప్రజలు ఆదరిస్తారు.. కరుణానిధి, జయలలిత, ఎంజీఆర్ కూడా అదే స్టయిల్ లో రాజకీయాలు చేశారు.. జయలలిత మరణం తర్వాత డీఎంకే అన్నాడీఎంకే పార్టీల హవానే తమిళనాడులో కొనసాగుతోంది. అయితే తమిళనాడులో రజనీకాంత్ లాంటి స్టార్స్ పార్టీ పెట్టాలని భావించినా.. అది పూర్తిస్థాయిలో వర్కౌట్ అవ్వలేదు.. కానీ విజయ్ మాత్రం యంగ్ స్టర్ గా ఉంటూనే.. రాజకీయ పార్టీని స్థాపించి..

దశాబ్దాల రాజకీయ చరిత్ర కల్గిన పార్టీలకు సవాల్ విసురుతున్నారు.. రెండు పార్టీలే తెలిసిన తమిళ ప్రజలకు విజయ్ తన పార్టీని పరిచయం చేశారు.. ఏపీలో పవన్ కళ్యాణ్‌ రాజకీయాల్లో రాణిస్తున్నారు.. ఆయన సక్సెస్ అందుకోవడానికి పదేళ్ల సమయం పట్టింది.. ఈ సమయంలో పోరాటాల ద్వారా ఆయన రాజకీయంగా రాటుదేలుతున్నారు.. అదే పంథాలో విజయ్ కూడా పాలిటిక్స్ చేస్తారని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాగా కాకుండా.. 2026లోనే సక్సెస్ అందుకుంటారని తమిళనాట చర్చ జరుగుతోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version