వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని వైసీపీ పార్లమెంటరీ నేత వై.వీ. సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి కార్యకర్తకు మేము అండగా నిలబడతామన్నారు. వైసీపీ కి చెందిన 57 మంది సోషల్ యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించారు అని తెలిపారు. 12 మంది కార్యకర్తల ఆచూకీ తెలియడం లేదన్నారు. హైదరాబాదు లో ఉండే పెద్దిరెడ్డి సుధారాణి అనే మహిళను అరెస్టు చేయకుండా ఐదు రోజులపాటు అక్రమంగా నిర్బంధించారు.
మా ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో తిరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అంశాలన్నింటిని మానవ హక్కుల సంఘం లో ఫిర్యాదు చేశామని తెలిపారు. వైసీపీ కార్యకర్తలను హింసించి వారి నుంచి అనుకూల స్టేట్ మెంట్ల ను తీసుకుంటున్నారు. తక్షణమే ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని హ్యూమన్ రైట్స్ కమిషన్ ని కోరినట్టు తెలిపారు వై.వీ. సుబ్బారెడ్డి. ఈ విషయంలో మానవ హక్కుల పరిరక్షణ సమితి స్పందించాలని కోరారు.