వరంగల్‌లో డేంజర్ జోన్‌లో సిట్టింగులు..ఆ ఎమ్మెల్యేలకు డౌటే.!

-

ఉమ్మడి వరంగల్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట..ఇప్పుడు బి‌ఆర్‌ఎస్ అడ్డా. మొత్తం 12 సీట్లు ఉన్న వరంగల్ లో 11 సీట్లలో బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్క ములుగులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఉన్నారు. అయితే ఈ సారి కూడా వరంగల్ లో సత్తా చాటాలని బి‌ఆర్‌ఎస్ ప్లాన్ చేస్తుంది. కాకపోతే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ సీటు ఇస్తే గెలుపు అవకాశాలు తగ్గుతాయని సర్వేలు చెబుతున్నాయి. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని ఎదుర్కుంటున్నారు.

దీంతో వారిని మార్చి..వారి స్థానంలో బలమైన  నేతలని నిలబెట్టాలని కే‌సి‌ఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో డేంజర్ జోన్ లో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు జనగాంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి..ఈయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. వ్యతిరేకత కూడా ఉందట..ఈయన్ని మార్చేసి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సీటు ఇస్తారనే ప్రచారం వస్తుంది. అటు స్టేషన్ ఘనపూర్ సీటులో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య తీరు వివాదాస్పదంగానే ఉంది. ఇక్కడ కడియం శ్రీహరి గాని, ఆయన కుమార్తెకు గాని సీటు ఇస్తారని టాక్.

ఇక డోర్నకల్ లో సీనియర్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌ని సైడ్ చేసి..ఆయన వారసురాలు ఎంపీ కవితని ఇక్కడ పోటీకి దింపుతారని తెలిసింది. అటు మహబూబాబాద్ అసెంబ్లీ సీటులో సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ని సైడ్ చేసి మంత్రి సత్యవతి రాథోడ్‌ని నిలబెడతారని కథనాలు వస్తున్నాయి. అటు వరంగల్ ఈస్ట్ లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కు మాజీ మంత్రి బసవరాజు సారయ్య పోటీ వస్తున్నారు.

ఈ సీట్లు తప్ప..మిగిలిన సీట్లలో దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఫిక్స్ అని తెలుస్తుంది. పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాలలో చల్లా ధర్మారెడ్డి, భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణ రెడ్డి, నర్సంపేటలో సుదర్శన్ రెడ్డి, వరంగల్ వెస్ట్ లో దాస్యం వినయ్ భాస్కర్, వర్ధన్నపేటలో ఆరూరి రమేశ్ పోటీ చేయడం ఖాయమని తేలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version