ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల హడావిడి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. మాచర్ల లో జరిగిన ఘటన చూసి చాలామంది భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు ఎక్కడా కూడా తగ్గటం లేదు. సార్వత్రిక ఎన్నికలలో తగిలిన దెబ్బ స్థానిక సంస్థల ఎన్నికల్లో కోలుకోవాలని తెలుగు దేశం పార్టీ బాగా కష్టపడుతుంది. మరోపక్క అధికార పార్టీ వైసీపీ ఈ ఎన్నికలలో పూర్తిగా మెజార్టీ స్థానాలు గెలిపించి తెలుగుదేశం పార్టీ కి రాష్ట్రంలో భవిష్యత్ లేకుండా చేయాలని అనేక వ్యూహాలు పన్నుతోంది.
ఇటువంటి తరుణంలో రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు కేవలం కమ్మ సామాజిక వర్గం వారే కాదు ఇతర కులస్తులు కూడా ఉన్నారు అంటూ ప్లకార్డులు పట్టుకుని కావాలంటే మేమందరం ” ‘ రెడ్డి ‘ కులం లోకి మారిపోతామ్ … ” అంటూ ప్రకటన చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. దయచేసి రాజధాని కోసం భూములు త్యాగాలు చేసిన మా బ్రతుకు లతో ఆడుకోవద్దని సర్కార్ కి సూచిస్తున్నారు.