పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC)కి వ్యతిరేకిస్తున్న వారిని బ్రేకల్లేని బస్సుల్లో పాకిస్తాన్ పంపుతామని తెలంగాణా బిజెపి ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న నేపధ్యంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణా సహా పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
దీనిపై స్పందించిన బండి సంజయ్, దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కంకణం కట్టుకున్నాయని విమర్శలు గుప్పించారు. ఓవైసీ సోదరుల ఆటలను తెలంగాణలో సాగనివ్వమన్న ఆయన, CAAని వ్యతిరేకించిన వారిని బ్రేకుల్లేని బస్సుల్లో పాకిస్తాన్ పంపుతామన్నారు. ద్రోహుల్లారా ఖబడ్దార్ అంటూ హెచ్చరించిన సంజయ్, మీరు రాళ్లు పడితే.. మేం బాంబులు పడతాం. మీరు కర్రలు పడితే.. మేం కత్తులు పట్టుకుంటాం,
అంటూ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అలాగే యుద్ధం మొదలైంది. ఇక ఎవరినీ వదిలేది లేదని హెచ్చరించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చూస్తున్నాయన్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకించిన పలు రాష్ట్రాలు తమ రాష్ట్రంలో దీన్ని అమలు చేసే అవకాశమే లేదని స్పష్టం చేసాయి. ఇక తెలంగాణా కూడా దీని విషయంలో వెనక్కు తగ్గే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.