నిధులు అందకపోవడం వల్లే ఓడిపోయాం.. అధిష్టానానికి బిజెపి అభ్యర్థుల ఫిర్యాదు..

-

తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ఎన్నికలకు ముందు డైలాగులు పేల్చిన బిజెపి నేతలు.. ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డారు.. కొన్ని నియోజకవర్గాల్లో విజయం సాధిస్తే మరికొన్ని చోట్ల ప్రభావం చూపలేకపోయారు.. గత ఎన్నికల్లో కంటే ఈసారి ఓట్ల శాతం పెరిగిందని తెలంగాణ బిజెపి నేతలు చెబుతున్నారు.. దీనిపై బిజెపి అధిష్టానం దృష్టి సారించింది.. ఏ ఏ నియోజకవర్గాల్లో ఎన్ని ఓట్లు వచ్చాయి..? ఏ సామాజిక వర్గాల తమ అనుకూలంగా ఓట్లు వేశారు..? అనే విషయాలపై లోతుగా ఆరా తీస్తుంది.. ఈ క్రమంలోనే కొందరు అభ్యర్థులు అధిష్టానానికి ఓ ఫిర్యాదు చేశారట.. తమ నియోజకవర్గాల్లో నిధులు సరిపోకపోవడం వల్లే తాము ఓడిపోయామని.. అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారట.. దీంతో ఆయన పార్టీ ఫండ్ దారి మళ్ళీందని అనుమానిస్తున్నారట..


ఎన్నికల సమయంలో ఏ నియోజకవర్గానికి ఎంత మేర నిధులు ఇచ్చారు..? పార్టీ ఫండ్ ఎంత వచ్చింది..? అనే విషయాల్ని నివేదిక రూపంలో అందించాలంటూ తన వద్దున్న షాడో టీం కి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారట.. దీంతో రంగంలో దిగిన షాడో టీం ఏ నియోజకవర్గానికి ఎంత నిధులు ఇచ్చారు.? ఎంత ఖర్చు పెట్టారు అనే దానిపై ఆరా తీస్తోందని పార్టీలో ప్రచారం జరుగుతుంది. బీజేపీ 8 అసెంబ్లీ నియోజకవర్గాల విజయం సాధించగా.. 19 చోట్ల రెండో స్థానానికే పరిమితమైంది..
రెండో స్థానంలో పరిమితమైన 19చోట్ల నిధులు సరిగా అందలేదని.. అందుకే తాము ఓడిపోయామని అభ్యర్థులు అధిష్టానానికి ఫిర్యాదు చేసారని.. అందుకే అమిత్ షాడో టీం తెలంగాణలో పర్యటిస్తోందని బిజెపి వర్గాలు చెబుతున్నాయి..

ఎన్నికల సమయంలో బిజెపి అధిష్టానం తెలంగాణలో విజయం పై సీరియస్ గా దృష్టి పెట్టింది.. గెలిచే నియోజకవర్గాలు.. బాగా కష్టపడితే గెలిచే నియోజకవర్గాలు.. అని విభజించి ఎన్నికల ఫండ్ ఖర్చు పెట్టిందట.. అయితే క్షేత్రస్థాయిలో డబ్బులు సరిగా పంచకపోవడం వల్లే తాము ఓడిపోయామని.. చెప్పినంత ఫండ్ తమకు రాలేదని కొందరు అభ్యర్థులు బిజెపి నాయకత్వానికి ఫిర్యాదు చేయడంతో అసలు పార్టీకి వచ్చిన నిధులు ఏమయ్యాయి అనే చర్చ పార్టీలో జోరుగా సాగుతుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version