ఏపీని ఇంత బాగా పరిపాలించినా.. ఆసరా పథకాలను ప్రవేశపెట్టినా.. నిరుద్యోగ భృతి ఇచ్చినా.. ఆడబిడ్డల కోసం పసుపు కుంకుమ పథకాన్ని తీసుకొచ్చినా.. సరిగ్గా ఎన్నికల సమయానికి పించన్లు పెంచినా.. ఎందుకు నన్ను ప్రజలు ఓడించారు.. అంటూ చంద్రబాబు తెగ మథనపడిపోతున్నారట.
ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోద్దో వాడే పండుగాడు.. అనే సినిమా డైలాగ్‌ను ఏపీలో ఉపయోగిస్తే.. పండు ప్లేస్‌లో జగన్‌ను పెట్టుకోవచ్చు. జగన్ దెబ్బకు నిజంగానే చంద్రబాబు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది.
ఏపీని ఇంత బాగా పరిపాలించినా.. ఆసరా పథకాలను ప్రవేశపెట్టినా.. నిరుద్యోగ భృతి ఇచ్చినా.. ఆడబిడ్డల కోసం పసుపు కుంకుమ పథకాన్ని తీసుకొచ్చినా.. సరిగ్గా ఎన్నికల సమయానికి పించన్లు పెంచినా.. ఎందుకు నన్ను ప్రజలు ఓడించారు.. అంటూ చంద్రబాబు తెగ మథనపడిపోతున్నారట.
అయితే..చంద్రబాబు ఇప్పటికీ ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పును నమ్మలేకపోతున్నారట. ఆయన్ను ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయట.
మనం ఇతర రాష్ర్టాల కంటే బాగానే పాలించాం. అభివృద్ధిలోనూ ఏపీ ముందంజలో ఉంది. అయినప్పటికీ.. టీడీపీని ప్రజలు ఎందుకు ఓడించారు.. అంటూ చంద్రబాబు టీడీపీ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో బోరుమన్నారట.
ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన 88 సీట్ల కంటే ఓ పది అటూ ఇటూ వస్తాయని ఊహించా కానీ.. ఇలా జరుగుతుందనుకోలేదు. ఈ ఫలితాలను అధ్యయనం చేయండి.. అంటూ పార్టీ నేతలతో చంద్రబాబు చెప్పారట.
జనసేన కొంప ముంచిందా?
అయితే.. టీడీపీ ఓడిపోవడానికి జనసేన కూడా ఒక కారణం కావచ్చా? అని టీడీపీ లెక్కలు వేసుకుంటోంది. జనసేన సపరేట్‌గా పోటీ చేయడం వల్ల… టీడీపీకి పడాల్సిన ఓట్లు కొన్ని జనసేనకు పడ్డాయని.. జనసేన, టీడీపీ ఒక్కటేనని తెలుసుకున్న ఏపీ ప్రజలు.. అటు జనసేనకూ వేయకుండా.. ఇటు టీడీపీకి వేయకుండా.. వైసీపీకి ఓట్లు వేశారని.. టీడీపీకి చెందిన ఓ సీనియర్ నేత వెల్లడించారు.
టీడీపీ భవిష్యత్తు వైసీపీ మీదనే ఆధారపడి ఉంది..
అవును.. ఇప్పుడు టీడీపీ భవిష్యత్తు వైసీపీ మీదే ఆధారపడి ఉంది. వైఎస్సార్సీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కనీసం 80 శాతం చేసినా చాలు. వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం పడతారు. ఒకవేళ వైఎస్సార్సీపీ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కితే.. మళ్లీ జనాలు టీడీపీ వైపు మళ్లే అవకాశం కూడా ఉంది. ఒకవేళ వైసీపీ హామీలను నెరవేర్చితే.. టీడీపీ కోలుకోవడం కష్టమే.. అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.