ఎవరెస్ట్‌పై ట్రాఫిక్ జామ్.. 16 మంది మృతి

-

ఈ సంవత్సరం ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కేందుకు నేపాల్ ప్రభుత్వం 381 మందికి అనుమతి ఇచ్చింది. దీంతో వాళ్లందరూ ఒక్కేసారి పర్వతం దగ్గరకు వచ్చి.. నేను ముందంటే నేను ముందు అంటూ పర్వతం ఎక్కడానికి పోటీ పడ్డారు.

అదేంటి.. ఎవరెస్ట్ పర్వతంపై ట్రాఫిక్ జామ్ అవ్వడమేంటి. అదేమన్నా రోడ్డా.. అక్కడికి వాహనాలు ఎలా వెళ్లాయి.. అంటూ టెన్షన్ పడకండి. ఎవరెస్ట్ మీదికి వాహనాలు ఏమీ వెళ్లలేదు కాదు కానీ.. ట్రాఫిక్ జామ్ అయింది మాత్రం నిజం. అది మనుషుల వల్లే. సాధారణంగా ఎవరెస్ట్ పర్వతం ఎక్కేటప్పుడు అనుకోని విపత్తులు రావడం వల్ల చాలా మంది చనిపోతుంటారు. కానీ.. ఈసారి మాత్రం మనుషుల తొక్కిసలాట వల్ల 16 మంది మృతి చెందారు.

ఈ సంవత్సరం ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కేందుకు నేపాల్ ప్రభుత్వం 381 మందికి అనుమతి ఇచ్చింది. దీంతో వాళ్లందరూ ఒక్కేసారి పర్వతం దగ్గరకు వచ్చి.. నేను ముందంటే నేను ముందు అంటూ పర్వతం ఎక్కడానికి పోటీ పడ్డారు. దీంతో పర్వతం ఎక్కే దారిలో తొక్కిస లాట జరిగింది. ఎక్కేవాళ్లు ఎక్కలేక.. కింది దిగే వాళ్లకు ప్లేస్ లేక.. అక్కడే చాలాసేపు ఉండలేక.. కింద పడి చాలామంది చనిపోయారు.

అదే సమయంలో వాతావరణం కూడా ఒక్కసారిగా మారిపోవడం.. మంచు గాలులు వీయడంతో చాలామంది మరణించారు. మరణించిన వారిలో ఇద్దరు భారతీయులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version