టీఆర్ఎస్ ఎంపీ లు పార్లమెంట్ లో ఏం సాధించారు : వీహెచ్

-

టీఆర్ఎస్ ఎంపీ లో పార్ల‌మెంట్ లో షో చేశార‌ని తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ . హ‌నుమంత రావు అన్నారు. ఇన్ని రోజులు పార్ల‌మెంట్ లో షో చేసి ఏం సాధించార‌ని ప్ర‌శ్నించారు. తాడో పేడో అని చెప్పి.. ఇప్పుడు తోక ముడిచార‌ని విమ‌ర్శించారు. ఢీల్లీ లో ఎం చేయ‌ని టీఆర్ఎస్ ఎంపీ లో ఇప్పుడు తెలంగాణ జిల్లాల గ‌ల్లి లో ఏం చాస్తార‌ని ప్ర‌శ్నించారు. అధికార పార్టీ ఎంపీ లు పార్ల‌మెంట్ లో ఎం చేయ‌కుండా.. జిల్లా లో తిర‌గుతామ‌ని చెప్ప‌డం సిగ్గుచేట‌ని విమ‌ర్శించారు.

అయితే జిల్లా ల‌కు వ‌స్తున్నా.. ఎంపీల ను రైతులు నిల‌దీయాల‌ని వీ హెచ్ రైతుల‌కు చెప్పారు. అలాగే వ‌రి ధాన్యం కొనుగోలు విష‌యం లో టీఆర్ఎస్, బీజేపీ రైతుల తో ఆడుకుంటున్నాయ‌ని విమ‌ర్శించారు. ఒక‌రి పై ఒక‌రు కార‌ణాలు చెబుతూ రైతుల నోట్లో మట్టి కోడుతున్నార‌ని విమ‌ర్శించారు. వరి ధాన్యం విష‌యం లో టీఆర్ఎస్, బీజేపీ దొంగ నాట‌కాలు ఆపాల‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version