తెలంగాణాలో మేయర్లను ఎప్పుడు ఎన్నుకుంటారు అంటే…?

-

తెలంగాణలో రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మున్సిపల్ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిసాయి. ఎక్కడో చెదురుమొదురు ఘటనలు మినహా పోలింగ్ అంతా ప్రశాంతంగా జరిగింది. మొత్తం 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం బుధవారం వెల్లడించనున్న నేపధ్యంలో,

దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనిపై ఎన్నో ఆశలుపెట్టుకున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఈ ఎన్నికల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఈ నేపధ్యంలో మేయర్లు, ఛైర్‌ పర్సన్ల ఎంపికకు సంబంధించి గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసారు. జనవరి 27న కొత్త పాలక మండళ్ల తొలి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలోని మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు.

సభ్యుల ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక అధికారికంగా జరుగుతుంది. అది పూర్తి అయిన వెంటనే డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్మన్ల ఎన్నికను నిర్వహిస్తారు. దీనికి సంబందించిన నోటీసును జనవరి 25న జారీ అధికారులు జారి చేస్తారు. ఇదిలా ఉంటే బుధవారం జరగని కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికలను శుక్రవారం జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news