లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ అఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని కీలక పాలసీలను ఆ సంస్థ రద్దు చేస్తుంది. మొత్తం 23 ఎల్ఐసీ పాలసీలు జనవరి 31 నుంచి రద్దు చేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. వాటిని గనుక మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం మరో వారం రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. నిలిపివేస్తున్న పాలసీలు అన్ని కూడా ప్రజాదరణ పొందినవే కావడం గమనార్హం.
అవి ఏంటీ అనేది ఒకసారి చూస్తే, జీవన్ ఆనంద్, జీవన్ ఉమాంగ్, జీవన్ లక్ష్య, జీవన్ లాభ్, సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్, న్యూ ఎండోమెంట్ ప్లాన్, న్యూ మనీబ్యాక్ 20 ఇయర్స్, అన్మోల్ జీవన్ 2, లిమిటెడ్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్, న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్, జీవన్ లక్ష్య, జీవన్ తరుణ్, జీవన్ లాభ్, న్యూ జీవన్ మంగళ్, భాగ్యలక్ష్మి ప్లాన్ పాలసీలను జనవరి 31 తర్వాత రద్దు చేస్తున్నారు.
నవంబర్ 30నే ఈ పాలసీలను రద్దు చేస్తున్నామని ఎల్ఐసి ప్రకటించినా ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవప్‌మెంట్ అథారిటీ-IRDAI గడువును 31 వరకు గడువు పొడిగించింది. రద్దు చేసిన వాటి స్థానంలో నూతన పాలసీలను అందుబాటులోకి తీసుకు రానుంది సంస్థ. వాటిని రద్దు చేయడానికి ప్రధాన కారణం ఐఆర్‌డీఏఐ గత ఏడాది కొన్ని నిభందనలు మార్చడంతో ఈ నిర్ణయం తీసుకుంది.