కారును నడిపించేంది వారిద్దరిలో ఎవరు..? కేటీఆర్ తర్వాత ఎవరి లీడ్ చేస్తారు..?

-

తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.. కేటీఆర్ దూకుడు బ్రేక్ వేసేందుకు రేవంత్ ప్లాన్ వర్కౌట్ అయింది.. ఫార్ములా ఈరేస్ కేసుపై కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదైంది.. ఈ వ్యవహారం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.. దీనిపై కేటీఆర్ హైకోర్టుకు వెళ్లారు.. 30 దాకా అరెస్ట్ చెయ్యొద్దంటూ కోర్టు ఆదేశాలిచ్చింది.. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.. ఇంతకీ ఏంటది..?

పార్టీ అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ కు కష్టాలు మొదలయ్యాయి.. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే రాజకీయాలు నడుపుతున్నారు.. ఆయన సూచనలు సలహాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు కాంగ్రెస్ ను ముప్పుతిప్పలు పెడుతున్నారు.. వారికి దూకుడుకు కళ్లెం వెయ్యాలని భావించిన కాంగ్రెస్ సర్కార్ ఫార్ములా ఈరేస్ కారు లో కేటీఆర్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించింది.. దీంతో ఏసీబీ ఆయనపై కేసు నమోదు చేసింది..

ఓ వైపు వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీఆర్ఎస్ ను మరోసారి కాంగ్రెస్ ఇరుకున పెట్టింది.. కేటీఆర్ పై కేసు నమోదు చెయ్మడంతో ఆయన్ని అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది.. ఇదే నిజమైతే.. కారు స్టీరింగ్‌ ఎవరికి అప్పగిస్తారంటూ పార్టీలో చర్చ మొదలైంది. ఈ కార్‌ రేస్ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్‌ నుంచి ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. దీంతో A1గా కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చి.. వ్యక్తిగతంగా విచారణ చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై ఆయన కోర్టును ఆశ్రయించారు.. 30 దాకా అరెస్ట్ చెయ్యొద్దంటూ కోర్టు ఆదేశాలిచ్చింది.. ఆ తర్వాత పరిస్థితులను బట్టి కేటీఆర్‌ను అరెస్ట్ చేయవచ్చన్న చర్చ జోరుగా సాగుతోంది

కేసీఆర్ పొలిటికల్ గా సైలెంట్ మోడ్ లో ఉన్నారు.. ఒక వేళ కేటీఆర్ ఆరెస్టు అయితే పార్టీని ఎవరు నడిపిస్తారన్న సందేహం క్యాడర్ లో కల్గుతోంది.. కేటీఆర్‌కు ప్రత్యామ్నాయంగా హరీశ్‌ రావు, కవిత పేర్లు పార్టీలో వినిపిస్తున్నాయి.. ఆ ఇద్దరూ పార్టీని సమర్ధవంతంగా లీడ్ చేయగలరని అధినేత కేసీఆర్ భావిస్తున్నారని గులాబీ నేతలు చర్చించుకుంటున్నారు.. ఈ మధ్య కవిత కూడా పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్న నేపథ్యంలో.. ఇందుకోసమే కవితను రంగంలో దింపారన్న టాక్ వినిపిస్తోంది..

ఇదే సమయంలో మాజీ మంత్రి హరీశ్‌రావు సైతం పార్టీలో కీలక పాత్ర పోషించబోతున్నారు.. కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్టుగా హరీష్‌ రావు పనిచేస్తారు.. అయితే కవితకు బాధ్యతలు అప్పగిస్తారా.. లేక హరీష్ రావు పార్టీని హ్యాండిల్ చేస్తారో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version