ఎన్నికలా.. ఎవరి కోసం.. కొడాలి నాని షాకింగ్ కామెంట్స్..!

-

ఆంధ్ర రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం ఎప్పుడు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది అనేదానిపై ఆసక్తికర చర్చ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే అటు ప్రతిపక్షం అధికార పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు కూడా జరుగుతున్నాయి. చిన్న పిల్లల ప్రాణాలను పణంగా పెట్టి పాఠశాల ను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లో మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తుంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు.

ఇక తాజాగా ప్రతిపక్షాల విమర్శలు పై స్పందించిన ఏపీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ స్కూలు తెరవకపోతే పిల్లలకు విద్యా సంవత్సరం కోల్పోతారని తెలిపిన కోడాలి నాని మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే ఎవరికి నష్టం కలుగుతుంది అంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తమకు స్పష్టత ఇవ్వాలంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని కోరారు మంత్రి కొడాలి నాని. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దంగా లేదు అని వ్యాఖ్యానించిన కొడాలి నాని.. ఉద్యోగులు కూడా ఎన్నికల విధులు నిర్వహించేందుకు ఒప్పుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version