అధికార కాంగ్రెస్, బీజేపీ దూకుడుగా ఉన్న చోట బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంది..? ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా..?

-

ఆ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు ఒక్కప్పటి కొంచుకోటలు.. గత ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలను గెలిచినా.. ఇప్పుడు పోటీ చేసేందుకు ఆ పార్టీ జంకుతోంది.. పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేద్దామా వద్దా అన్న ఆలోచనలో పార్టీ ఎందుకుంది..? ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందంటున్న కారు పార్టీ నేతలు.. దాన్ని నిరూపించే ఛాన్స్ వచ్చినా సైలెంట్ గా ఎందుకు ఉన్నారు..?

తెలంగాణను పదేళ్ల పాటు శాసించిన బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతోంది.. ఢీ అంటే ఢీ అంటోంది. .ఈ సమయంలో.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భయపడుతోందన్న ప్రచారం జరుగుతోంది.. అప్పటి కంచుకోటలో సత్తా చాటే ఛాన్స్ వచ్చినా కూడా.. ఒకటికి పదిసార్లు ఆలోచిస్తోంది.. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదన్న చర్చ పార్టీలో జరుగుతోంది.. ఎన్నికల టైమ్ దగ్గర పడుతున్నా.. పార్టీలో ఆ జోష్ కనిపించడంలేదట.

గతంలో మూడుసార్లు గెలిచిన ఈ పార్టీ.. ఇప్పుడు పోటీ చేద్దామా వద్దా అన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.. పార్టీ హైకమాండ్ దగ్గర నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో.. క్యాడర్ కూడా డైలమాలో ఉంది.. పార్టీలో ఏం జరుగుతుందో తెలియన నియోజజకవర్గ స్థాయి నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఫిబ్రవరిలో ఎన్నికలుంటాయి.. ఓటర్ల నమోదుకు గడువు కూడా ముగిసింది.. అధికార కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా పావులు కదుపుతుంటే.. బీఆర్ఎస్ లో మాత్రం ఎలాంటి చలనం లేకపోవడంపై క్యాడర్ లో చర్చ నడుస్తోంది..

పట్టభద్రుల సెగ్మెంట్ పరిధిలో 42 ఎమ్మెల్యే సీట్లు, ఆరు ఎంపీ సీట్లున్నాయి.. 15 ఎమ్మెల్యే సీట్లను బీఆర్ఎస్ గెలిచినా.. వారిలో సగానికి సగం మంది యాక్టివ్ గా లేరు.. ఈ కారణంతోనే బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉందన్న ప్రచారం జరుగుతోంది.. చివరి నిమిషంలో ఎవరో ఒకరికి మద్దతు ప్రకటిస్తే సరిపోతుందన్న ఆలోచనలో గులాబీ హైకమాండ్ ఉందన్న మాట వినిపిస్తోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version