ఆ సీనియర్ నేతకు కాంగ్రెస్ టిక్కెట్ ఇస్తుందా.. హ్యాండ్ ఇస్తుందా..? పార్టీలో జరిగే తాజా చర్చ ఇదే..

-

తెలంగాణ రాష్టం ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. ఓ వైపు నామినెటెడ్ పదవుల భర్తీ.. మరోవైపు.. పీసీసీ అధ్యక్షుని నియామకంతో పార్టీలో జోష్ కనిపిస్తోంది.. ఈ క్రమంలో ఉత్తర తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగాతీసుకుంది.. సిట్టింగ్ స్తానాన్ని నిలబెట్టుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.. అయితే ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. ఎవరికి టిక్కెట్ ఇవ్వాలనే డైలామాలో కాంగ్రెస్ అధిష్టానముంది..

ఉత్తర తెలంగాణాలో మరోసారి పట్టు నిలుపుకునేందుకు.. కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది.. టికెట్‌పై ఆశలు పెట్టుకున్న అశావాహులు ముఖ్యనేతల చుట్టూ తిరుగుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి బరిలోకి దిగేందుకు రెఢిగా ఉన్నా, టికెట్ విషయంలో ఇంకా క్లారిటీ లేదు. దీంతో జీవన్ రెడ్డి కూడా సైలెంట్ ‌అయ్యారట. ఆయన ఇస్తారా.. ఇవ్వరా అనే డైలమాలో ఆయన అనుచరులు ఉన్నారు..

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే విషయంలో జీవన్ రెడ్డి అధిష్టానంపై అసంతృప్తి వెళ్లగక్కారు.. ఓ దశలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సైతం సిద్దమయ్యారు.. ఈ వేడి ఇంకా చల్లారకముందే.. ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ మొదలవ్వడంతో.. ఆయనకు టిక్కెట్ ఇవ్వకపోతే.. బాంబ్ పేలుస్తారనే టెన్షన్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానముందని తెలుస్తోంది.. ఆయనకు ఇవ్వకపోతే మరో అభ్యర్ది ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది..

బలమైన అభ్యర్ది కోసం కాంగ్రెస్ పార్టీ అన్వేషణ చెయ్యాల్సి ఉంటుంది.. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయి.. బీఅర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పొటీ ఇవ్వగా.. పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ పైచేయి సాధించింది. ఈ రెండు పార్టీలను ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ మరింత వ్యూహాలతో ముందుకు సాగాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీ అభ్యర్దిగా జీవన్ రెడ్డి మరోసారి పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ.. ఆయన్ని కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారట.. దీంతో ఎవరికి టిక్కెట్ కేటాయించాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version