గతంలో ఏపీ అసెంబ్లీలో మాట్లాడే సమయంలో… “జగన్ ఎప్పుడు అధికారపక్షంలోనే కొనసాగుతారు” అంటూ టంగ్ స్లిప్ అయిన సంగతి తెలిసిందే! అదే క్రమంలో… ఆదివారం మీడియాతో మాట్లాడిన యనమల… “సంక్షేమంలో గత ప్రభుత్వం కన్నా ఇప్పటి ప్రభుత్వం తక్కువ ఖర్చు చేసింది” అని చెప్పారు. అంటే… ఏపీలో జగన్ సర్కార్ సంక్షేమానికే మొత్తం డబ్బు ఖర్చు చేయడం లేదనేది యనమల ఉద్దేశ్యం కాబోలు!
గత చంద్రబాబు హయాంలో అభివృద్ధీ – సంక్షేమం.. రెండూ జనాలవరకూ రాలేదు! కాగితాల్లో ఉన్న నెంబర్లు అయితే అద్భుతః కానీ.. ప్రజలకు చేరువయిన సందర్భాలు తక్కువ! అందులో కూడా పార్టీలు – కులాలు – మతాలు – కార్యకర్తలు – జన్మభూమి కమిటీలు అంటూ చాలా ఫిల్టరింగ్ జరిగింది. ఫలితంగా ప్రజాగ్రహాన్ని బాబు రుచిచూశారు!
అయితే… ఇప్పుడు టీడీపీ నేతలు మైకులముందుకువచ్చి చేస్తున్న ప్రచారాల్లో… జగన్ సంక్షేమ పథకాల ప్రస్థావన ఒకటి. రాష్ట్ర ఖజానా మొత్తాన్ని సంక్షేమ పథకాల పేరుచెప్పి పంచేస్తున్నారని ఇంతకాలం టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. యనమల రామకృష్ణుడేమో… జగన్ సంక్షేమానికి ఖర్చు చేసింది.. తమతో పోలిస్తే తక్కువే అంటున్నారు. సపోజ్.. ఫర్ సపోజ్… యనమల చెబుతున్నట్లుగా సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేసి ఉంటే… అవి నేరుగా ప్రజలకు ఎందుకు అందలేదు? అందితే.. 23కి ఎందుకు పడిపోయినట్లు! ఆత్మవిమర్శ చేసుకుంటే.. అన్నీ అర్ధమవుతాయి కదా!
అటు టీడీపీ నేతలు – ఇటు యనమల కామెంట్లు… వీటిలో ఏ విషయాన్ని జనాలు నమ్మాలి. జగన్ ఖజనాలోని సొమ్ము మొత్తాన్ని ప్రజలకు పథకాలపేరుచెప్పి పంచేస్తున్నారనే మాట నమ్మాలా? టీడీపీతో పోలిస్తే జగన్ సంక్షేమ పథకాలకు తక్కువ ఖర్చుచేస్తున్నారని భావించాలా? తక్కువ ఖర్చుచేసినా కూడా అవినీతికి తావులేకుండా.. పారదర్శకంగా నేరుగా అకౌంట్లలోకి వేస్తున్నారని నమ్మాలా? టీడీపీ నేతలే క్లారిటీ ఇవ్వాలి?
ఏది ఏమైనా… యనమల ఇలా జగన్ ను ఇరకాటంలో పడేసి.. తాము చాలా గొప్పవారమనే ఆలోచనతో చెప్పిన ఈ కామెంట్ల వల్ల… జగన్ సేవ్ అవగా… బాబు షేం అయ్యారనే అనుకోవాలి. జగన్ కంటే కూడా సంక్షేమానికి ఎక్కువ ఖర్చు చేసిన బాబు… ఆ ఫలాలు ప్రజలకు అందించడంలో వెనుకబడ్డారనే నమ్మాలి!