రాష్ట్ర రాజకీయాలన్నీ ఒక ఎత్తు అయితే రాయలసీమ రాజకీయాలు ఒక ఎత్తు. 52 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాయలసీమ రాష్ట్రంలో ఎవరు అధికారం చేపట్టాలి అనేది నిర్ణయిస్తుంది. 2014లో 22 స్థానాలు టీడీపీ గెలుచుకోగా 30 స్థానాలు వైసిపి కైవసం చేసుకుంది. రాయలసీమలో వైసీపీ హవా ఎక్కువ. టిడిపికి కొన్ని సీట్లలో బలం ఉంది. జనసేన ప్రభావంతక్కువే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2019లో జనసేన, టిడిపి, వైసిపి పోటీ చేస్తే 52 స్థానాలకు వైసిపి 49 స్థానాలను భారీ మెజారిటీతో కైవసం చేసుకుంది. కేవలం ఒక మూడు స్థానాలు మాత్రమే టిడిపి గెలుచుకోగలిగింది.
జనసేనకు అయితే డిపాజిట్లు కూడా రాలేదు. కానీ ఈసారి టిడిపి జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో రాయలసీమ రాజకీయాల మారుతాయి అని టిడిపి నాయకులు అంటున్నారు. కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం ఎవరు ఎవరితో కలిసి వచ్చిన సీమ ఓటర్లు మాత్రం కచ్చితంగా వైసీపీ నే గెలిపిస్తారని, మళ్లీ అధికారంలోకి వైసిపి రావాలని వారంతా అనుకుంటున్నారని చెబుతున్నారు. అమరావతి మాత్రమే అభివృద్ధి చేయాలి అని తలచిన చంద్రబాబు నాయుడును రాయలసీమ వాసులు ఆదరించలేకపోతున్నారు. కడప జిల్లా వారు తమ జిల్లా వాడే ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షతో 2019 లో వైసీపీకి ఓట్లు వేశారు.
రాయలసీమలో వైసీపీకి మంచి గట్టు పట్టు ఉంది. ప్రజలలో మమేకమయ్యే లీడర్లు వైసిపి లో ఉన్నారు. దేశ రాజకీయాలను శాసించగలిగే లీడర్లు రాయలసీమలో ఉన్నారు. రాయలసీమ ఓటర్ల తీర్పుతో తీర్పుపై రాష్ట్ర అధికారం ప్రభావితమై ఉంటుంది. ఈసారి ఎన్ని పార్టీలు కలిపి పోటీ చేసినా గెలిచేది రాయలసీమలో వైసిపినే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.