టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టనున్న వైసీపీ… రాజమండ్రి రూరల్‌పై వైసీపీ పక్కా స్కెచ్

-

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి కంచుకోటలను బద్దలు కొట్టే దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు.టీడీపీలో కీలకంగా ఉన్న నేతలను రానున్న ఎన్నికల్లో ఓడించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యేక ఓపరేషన్ స్టార్ట్ చేసారాయన. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గానికి పేరుంది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటినుంచి ఇక్కడ వరుసగా టీడీపీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం టీడీపీ సీనియర్‌ నేత, సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేగా ఉన్నారు.అయితే ఈసారి బుచ్చయ్యను ఇంటికి పంపడమే టార్గెట్ గా ప్లాన్ చేశారు సీఎం జగన్.

రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కాపు,శెట్టిబలిజ ఓటర్లే కీలకం. కాగా ఈనియోజకవర్గానికి శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన మంత్రి వేణుగోపాలకృష్ణను నియమించడం ద్వారా టార్గెట్‌కు రీచ్‌ కావచ్చన్నది వైసీపీ వ్యూహం. అందుకే రామచంద్రాపురంలో ఉన్న మంత్రి వేణుగోపాలకృష్ణను ఇక్కడికి పంపారు.అధిక సంఖ్యలో ఉన్న శెట్టిబలిజ సామాజిక వర్గం ఓటర్లను ప్రభావితం చేయాలన్నదే ఇక్కడ టార్గెట్. అలా కుల సమీకరణతో టీడీపీ ని దెబ్బకొట్టే విధంగా సీఎం జగన్ రాజమండ్రి రూరల్లో ప్లాన్ చేశారు.అయితే టీడీపీ ఈసారి కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరినే బరిలోకి దింపనుంది.

లేదంటే ఆయన కుమారుడిని రంగంలోకి దింపే అవకాశాలు కూడా ఉన్నాయి.ఇప్పటికే మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకున్న టీడీపీ నాలుగోసారి కూడా విజయకేతనాన్ని ఎగురవేసేందుకు ఇక్కడ ప్రయత్నాలు చేస్తోంది.ఆ ప్రయత్నాలను అడ్డుకుని వైసీపీ జెండా రెపరేపలాదాన్నదే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది.

2009 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర మంతా వైఎస్‌ రాజశేఖరెడ్డి ప్రభావం ఉన్నా ఇక్కడ మాత్రం తెలుగుదేశం పార్టీ జెండానే రెపరెపలాడింది. ఆ పార్టీ నుంచి చందన రమేష్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. 2019లో రాష్ట్ర మంతా వైసీపీ గాలి వీచినా రామండ్రి రూరల్‌ నియోజవర్గంలో మాత్రం టీడీపీ నెగ్గింది.2009,2014,2019 ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు ఏకపక్షంగా తీర్పునిచ్చారు.

అయితే ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయాలని సీఎం జగన్ రాజమండ్రి రూరల్ పై దృష్టిపెట్టారు. శెట్టిబలిజ సమాజికవర్గంలో బలమైన నేత మంత్రి వేణుగోపాలకృష్ణ. ఆయన్ని ఇక్కడికి తీసుకురావడం ద్వారా సంబంధిత సామాజికవర్గంతో సత్సంబంధాలు ఏర్పడుతాయి.ఎన్నికల్లోపు వారందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలి. ఈమేరకు మంత్రి చెల్లుబోయిన కూడా సీఎం ఆదేశాలు ప్రకారం తన కార్యాచరణ ఇప్పటికే మొదలు పెట్టారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version