విశాఖ నార్త్‌లో తొలిసారి వైసీపీ హవా..పక్కా విన్నింగ్..!

-

విశాఖ: విశాఖ నగరంలో వైసీపీకి పెద్ద కలిసి రాదనే చెప్పాలి…గత రెండు ఎన్నిక్లల్లో కూడా నగరంలో వైసీపీ రాణించలేదు.విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ సీట్లలో వైసీపీ ఇంతవరకు గెలవలేదు. 2014లో ఈస్ట్, వెస్ట్, సౌత్ సీట్లలో టి‌డి‌పి గెలవగా, పొత్తులో భాగంగా నార్త్ లో బి‌జే‌పి గెలిచింది. ఇక 2019 ఎన్నికల్లో విశాఖ రూరల్ ప్రాంతంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది గాని..నగరంలో సత్తా చాటలేకపోయింది. ఒక్క సీటు కూడా గెలవలేదు. నాలుగు సీట్లు టి‌డి‌పి గెలుచుకుంది.

ఇక అధికారంలోకి వచ్చాక విశాఖలో బలోపేతం లక్ష్యంగా వైసీపీ ముందుకెళుతుంది. ఈ క్రమంలోనే విశాఖని రాజధానిగా ప్రకటించారు. దీంతో విశాఖ నగర కార్పొరేషన్ లో వైసీపీ గెలిచింది. అటు  విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ని వైసీపీలోకి తీసుకున్నారు. అలా అలా నగరంపై వైసీపీ పట్టు సాధిస్తూ వస్తుంది. ఇదే క్రమంలో విశాఖ నార్త్ సీటులో వైసీపీ ఆధిక్యంలోకి వచ్చింది. ఇక్కడ వైసీపీ ఇంచార్జ్ కే‌కే రాజు దూసుకెళుతున్నారు. గత ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావుపై కేవలం 2 వేల ఓట్ల తేడాతోనే రాజు ఓడిపోయారు. అయితే గెలిచిన గంటా అడ్రెస్ లేకుండా వెళ్ళిన..రాజు మాత్రం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తూ వస్తున్నారు.

వైసీపీని బలోపేతం చేశారు..ప్రజలకు కావల్సిన పనులు చేసి పెట్టారు. దీంతో అక్కడ ఆయనకు ఆధిక్యం వచ్చింది. టి‌డి‌పి మైనస్ లోకి వెళ్లింది. ఈ క్రమంలో నెక్స్ట్ విశాఖ నార్త్ సీటులో వైసీపీ గెలవడం దాదాపు ఖాయమనే ప్రచారం వస్తుంది. కాకపోతే టి‌డిపి-జనసేన కలిస్తే కాస్త పోటీ టఫ్ అవుతుంది. గత ఎన్నికల్లో విశాఖ నార్త్ లో జనసేనకు 20 వేల ఓట్ల వరకు పడ్డాయి. అయితే మెజారిటీ ప్రజలు రాజు వైపే ఉన్నట్లు కనిపిస్తున్నారు. కాబట్టి నార్త్ లో వైసీపీ జెండా ఎగిరే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version