చంద్రబాబు నోట పోలవరం మాట ఒక్కసారి కూడా రాలేదు : జగన్

-

ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు కోసం చేసిందేమీ లేదని, పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత కూడా చంద్రబాబు కి లేదని తెలిపారు. పోలవరం పనులన్నీ చంద్రబాబే చేశారని ఎల్లో మీడియా వార్తలు రాస్తోందని జగన్ వారి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1995 నుంచి 2014 వరకు చంద్రబాబు నోట ఒక్కసారి కూడా పోలవరం మాట రాలేదని జగన్ తెలిపారు. పోలవరంలో ఎక్కువ డబ్బులు వచ్చే పనులను ముందు చేశారని, ఆ తర్వాత తక్కువ డబ్బులు వచ్చే పనులు చేశారని అన్నారు ఆయన. కాఫర్ డ్యామ్ లో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని తెలియచేశారు. టీడీపీ చేపట్టిన అనాలోచిత నిర్ణయాల వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని అన్నారు జగన్. చంద్రబాబు ధ్యాస మొత్తం డబ్బుపైనే అని మండిపడ్డారు. అసెంబ్లీలో ఇవన్నీ వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి జగన్.

పోలవరం తన కలల ప్రాజెక్టు అని వైఎస్సార్ చెప్పారని… ఆ తన తండ్రే ప్రాజెక్టును ప్రారంభించారని జగన్ స్పష్టపరిచారు. పోలవరం పనుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 800 కోట్లు ఆదా చేశామని తెలియచేశారు ఆయన. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 48 గేట్లు పూర్తి చేశామని చెప్పారు. సీడబ్ల్యూసీ సిఫారసుల మేరకు తొలిదశలో పోలవరం డ్యామ్ ను 41.15 మీటర్ల ఎత్తు వరకు కడతామని… ఆ తర్వాత 45.7 మీటర్ల ఎత్తు వరకు డ్యామ్ నిర్మాణం జరుగుతుందని జగన్ తెలియచేసారు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడటానికే ప్రధాని మోదీని కలిశానని చెప్పారు జగన్. ప్రాజక్టు తాత్కాలిక పనుల కోసం రూ. 15 వేల కోట్లు అడిగానని ముఖ్యమంత్రి తెలియచేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version