వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం లభిస్తుంది. ఈ రోజుల్లో కూడా చాలా మంది వాస్తు ని అనుసరిస్తున్నారు. వాస్తుని ఫాలో అయితే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. పండితులు ఈ రోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు వీటిని కనుక మహిళలు అనుసరించారంటే కచ్చితంగా సమస్యలు ఏమీ లేకుండా హాయిగా ఉండొచ్చు.
చాలామంది ఇళ్లల్లో రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి ఆనందంగా లేకపోవడం అస్తమాను గొడవలు ఇలా ఏదో ఒకటి.. అటువంటి వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు అలా కాకుండా సమస్యలకు దూరంగా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట తలస్నానం చేయకూడదు ఇలా చేయడం వలన వాస్తు దోషాలు కలుగుతాయి. రాత్రి నిద్ర పోయేటప్పుడు తలని వదిలేసి నిద్రపోకూడదు కచ్చితంగా తలని అల్లుకోవాలి అప్పుడు నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది.
అయితే తలని భర్త ఉన్నప్పుడు విప్పచ్చు. వదిలేసి నిద్రపోవచ్చు. మిగిలిన సమయాల్లో తల అల్లుకునే ఉండాలి. ఆనందం కలిగి ప్రశాంతంగా ఉండాలంటే దక్షిణ దిశలో రాత్రిపూట దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే ఆనందంగా ఉండొచ్చు. సమస్యల నుండి బయట పడొచ్చు. పాజిటివ్ ఎనర్జీ కలిగే ఇబ్బందులు నుండి దూరంగా ఉండాలంటే దిండు కింద పుస్తకాలు మొబైల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ వస్తువులని ఉంచరాదు. ఇలా ఈ తప్పులను చేయకుండా చూసుకుంటే పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఆనందంగా జీవించొచ్చు.