వైసీపీ మంత్రుల్లో కలవరం.. స్వగ్రామం వైపు పరుగులు..!?

-

ఏపీలో పంచాయతీ పోరు జోరుగా కొనసాగుతోందని చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఎలాగైనా గెలవాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నియోజకవర్గ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు కార్యచరణ మొదలుపెట్టారు. ఇప్పటికే జరిగిన తొలి, రెండవ దశ ఎన్నికల్లో కొన్ని చోట్ల మంత్రులు ప్రత్యర్థులను ఒడించడంలో విఫలమయ్యారు. దీనిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి అందరిపై మండిపడినట్లు సమాచారం. వైసీపీ అభ్యర్థులు ఎలాగైనా గెలివాలని.. దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

jagan

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలతోపాటు మంత్రులు చుక్కలు చూస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని అధిష్టానం నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. దీంతో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల దూకుడు అడ్డుకట్ట వేసేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల వైసీపీ అభ్యర్థులు ఓడిపోవడంతో మంత్రులు, ఎమ్మెల్యేలకు మరింత కలవరపెడుతోంది. సొంత గ్రామాల్లోనే పార్టీ స్థానానికి దక్కించుకోవడం లేదనే వాదన వస్తుండటంతో అధిష్టానం ఈ వార్తను సీరియస్‌గా తీసుకుంది.

ఇప్పటికే టీడీపీ అభ్యర్థులు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల వైఫల్యాలను టార్గెట్ చేసుకుని ప్రచారం చేస్తున్నారు. కొంచెం తప్పు దొరికినా మీడియాలో సెన్సెషనల్ చేస్తున్నారు. దీంతో పార్టీ ఆచుతూచీ వ్యవహరిస్తోంది. అయితే పార్టీ రహితంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఎవరూ ఎవరికి మద్దతిస్తున్నారు. ఏ అభ్యర్థి ఎవరి సాయంతో గెలుస్తున్నారనేది తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ మంత్రులను టార్గెట్ చేస్తూ టీడీపీ నాయకులు, అభ్యర్థులు ప్రచారాలు చేస్తున్నారు. తాజాగా మంత్రి కొడాలి నాని స్వగ్రామమైన యలమర్రులో టీడీపీ అభ్యర్థి శిరీష విజయం సాధించడమే ప్రాధాన కారణం. దీంతో పాటు రాష్ట్రంలోని మంత్రుల నియోజకవర్గంలోని స్వస్థలాల్లో ప్రత్యర్థులు వైసీపీ అభ్యర్థులకు గట్టిపోటీ ఇస్తున్నారు.

వైసీపీ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ స్థానాలతో పాటు ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. స్వగ్రామ పంచాయతీ స్థానాల్లోనూ వైసీపీ జెండా ఎగురవేసేలా చర్యలు తీసుకోవాలని అధికార ప్రభుత్వం హెచ్చరించింది. కానీ టీడీపీ, ఇతర పార్టీ నాయకులు మంత్రులు, ఎమ్మెల్యేలు పుట్టిన ప్రాంతంలోని పంచాయతీలనే టార్గెట్ చేసుకున్నారు. దీంతో ఆయా ప్రాంతాల మంత్రులు వారి స్వస్థలాలపై పరుగులు తీస్తున్నారు. సొంత గ్రామంలోనే వైసీపీ అభ్యుర్థులను గెలుపించుకోవడం లేదనే వార్తలు రావడంతో.. అధిస్టానం సీరియస్‌గా తీసుకుంది. నియోజకవర్గంతోపాటు స్వగ్రామంలోని పంచాయతీ స్థానాలను కాపాడుకునేందుకు మంత్రులు పరుగులు తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version