వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాగాలని చూశారా..? బాంబ్ పేల్చిన ఎమ్మెల్యే..

-

మూడు పార్టీలు కలిసి పోటీ చేసి.. ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకున్నాయి.. ప్రత్యర్దిని 11 సీట్లకే పరిమితం చేశాయి.. ఈ క్రమంలో వారికి పక్క పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.. కానీ ఏపీలో టీడీపీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందనే టాక్ వినిపిస్తోంది.. వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే పేల్చిన బాంబ్.. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.. వైసీపీని బలహీన పరిచేందుకు చంద్రబాబు తన ఆలోచనలకు పదును పెట్టారని తెలుస్తోంది.. పార్టీ ఎమ్మెల్యేలను లాక్కుని వైసీపీని నిర్వీర్యం చెయ్యాలని చూస్తున్నారంట.. ఇంతకీ వైసీపీ ఎమ్మెల్యే చెప్పిన సంచలన నిజాలేంటో చూద్దాం..

ఉమ్మడి విశాఖ జిల్లా పాడేరు వైసీపీ ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు.. తొలిసారి ఎమ్మెల్యే.. జగన్మోహన్ రెడ్డి అతన్ని పిలిచి అవకాశంకల్పించారు.. పాడేరులో వైసీపీ బలంగా ఉండటంతో అక్కడి ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు.. దీంతో ఆ నియోజకవర్గంలో ఎలాగైనా పాగా వెయ్యాలని భావించిన సీఎం చంద్రబాబు నాయుడు అతన్ని.. పార్టీలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేశారనే స్వయంగా ఎమ్మెల్యేనే కార్యకర్తల సమావేశంలో చెప్పుకొచ్చారు.. రాయబేరాలు సైతం చేశారని ఆయన సంచలన విషయాలను వెల్లడించారు.. కూటమికి అనుకూలంగా ఉండాలని చంద్రబాబు తరపు ప్రతినిధులు ఆయన్ని సంప్రదించినట్లు ఎమ్మెల్యే బాంబ్ పేల్చారు.. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.. ఇప్పటికే ఎమ్మెల్సీలు, రాజ్యసభలు సభ్యులు పార్టీ వీడుతున్న సమయంలో .. ఎమ్మెల్యేలను కూడా తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు టీడీపీ చేస్తోందనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లలో ఏజెన్నీలో పట్టు పెంచుకునేందుకు టీడీపీ సర్వశక్తులను ఒడ్డింది.. నియోజకవర్గ ఇన్చార్జులను మార్చి.. కొత్తవారికి అవకాశం కల్పించింది.. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఏజెన్సీ ప్రాంతాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది.. కానీ గత ఎన్నికల్లో రెండు ఎమ్మెల్యే స్థానాలతో పాటు.. ఓ ఎంపీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది.. దీంతో ఆయా స్థానాల్లో గెలిచినవారిని తమ వైపుకు తిప్పుకోవాలని టీడీపీ అధిష్టానం భావించిందట.. వచ్చె ఎన్నికల్లో ఆ నియోకవర్గాల్లో పాగా వెయ్యాలంటే.. ఇదే సరైన వ్యూహమని.. వారితో సంప్రదింపులు జరిపినట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి.. పాడేరు వైసీపీ ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మాత్రం తాను వైసీపీలోనే ఉంటానని స్పష్టం చెయ్యడంతో.. మిగిలిన వారిని టచ్ చేసే సాహసం టీడీపీ చెయ్యలేదనే టాక్ వినిపిస్తోంది..

వైసీపీ ఆవిర్భావం నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ పార్టీకి కంచుకోటగా మారాయి.. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు ఇబ్బందికరంగా ఉండటంతో.. పార్టీ మారే ఆలోచనలో ఎవ్వరూ లేరని వైసీపీ నేతలు చెబుతున్నారు.. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేలను వైసీపీ అధిష్టానం ఎలా కాపాడుకుంటుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version