మీడియా నుంచే జానీ మాస్టర్ వివాదం తమ వద్దకు వచ్చింది అని తెలుగు ఫీలిం ఛాంబర్ మెంబర్ అయిన తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. 2013లో ఆసరా అని పెట్టాం.. 2018లో సరికొత్తగా ప్యానల్ పెట్టాం. ఎన్ని పెట్టినా ఉమెన్ కు దైర్యం ఇవ్వలేకపోతున్నాము. ప్రతి అమ్మాయికి తెలియాలి. తమకు సపోర్ట్ ఉందనే ధైర్యం కావాలి.. అందుకు తగ్గ కమిటీ ఉండాలి. 90 రోజుల్లో జానీ మాస్టర్ కేసు సాల్వ్ అవుతుంది. మాకు ప్రెజర్స్ ఉంటాయి.
కానీ సినిమా ఇండస్ట్రీలో ప్రతి అమ్మాయికి రక్షణ కావాలి. వర్క్ దొరకదనే భయం కాకుండా.. నా ప్రతిభకు తగ్గ గుర్తింపు అనే అవకాశం ఉండాలి. ఆ పరిస్దితులు రావాలన్నది మా ఆలోచన. ఛాంబర్ తరపున ప్రతి యూనియన్ కు ఓ కంప్లైట్ కమిటీ పెట్టుకోవాలని సూచించనున్నాము. ఛాంబర్ తరపున కమిటీ ఉండనే ఉంది. డాన్సర్ యూనియన్ వారు కూడా ఈ విషయంలో మాతో పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు అని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు.