వచ్చే యాసంగి లో రైతులు వరి వేసుకోవచ్చు అని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ అన్నారు. కానీ దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయని అన్నారు. రైతులు ఎవరైనా.. వరి వెస్తే దానికి ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వదని తెలిపాడు. అలాగే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కూడా చెయదని స్పష్టం చేశారు. రైతులు సొంత రిస్క్ తోనే వరి పంట వేసుకోవాలని తెలిపారు.
వారి ఆహారం కోసం గానీ లోకల్ వ్యాపారు లతో కాని ఒప్పందం చేసుకుని వరి పంట వేసుకోవచ్చని సీఎం కేసీఆర్ తెలిపాడు. అయితే దీని కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి గ్యారంటీ ఇవ్వదు అని తెలిపాడు. కానీ రైతు బందు తప్పక కుండా ఇస్తామని తెలిపాడు. అలాగే 24 గంటల కరెంటు ను కూడా ఇస్తామని తెలిపాడు. దీంతో పాటు వరి కి సరిపోయే అన్ని నీళ్లు కూడా ఇవ్వ డానికి సిద్ధం గా ఉన్నామని స్పష్టం చేశాడు. కానీ వరి ధాన్యం మాత్రం కొనుగోలు చేయలేమని తెలిపాడు.