” మీ భార్య CM అవుతారు అంట కదా ” అని అడగగానే జగన్ రియాక్షన్ ఇదే !

-

ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేస్తూ ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయ్యే క్యాండిడేట్ అనంతపురం తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఇటీవల మందడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా కొనసాగించాలని దీక్ష చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపే కార్యక్రమంలో పాల్గొన్న జేసీ దివాకర్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు.

ఈ సంవత్సరం వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే మరుసటి ఏడాది వైయస్ భారతి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉండొచ్చని ఒకరి మూర్ఖత్వం వల్ల మనకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని జేసీ దివాకర్ రెడ్డి కామెంట్ చేశారు. విశాఖ పట్టణంలో రాజధాని పెట్టాలని జగన్ ఒక్కడే నిర్ణయం తీసుకుంటే సరిపోదని అందరి నిర్ణయాలు అభిప్రాయాలు తీసుకోవాలని అమరావతి ప్రాంతంలో కేవలం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే భూములు కొన లేదని ఒక కులం పై మరియు వ్యక్తి పై ద్వేషంతో ఇలా చేయడం సరికాదు అంటూ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడటం జరిగింది.

దీంతో వైయస్ భారతి పై చేసిన ముఖ్యమంత్రి కామెంట్లు సోషల్ మీడియాలో మరియు ఎలక్ట్రానిక్ మీడియా లో వైరల్ అవుతున్న నేపధ్యం లో ఈ విషయం వైయస్ జగన్ దాక వెళ్లడంతో జెసి ” మీ భార్య CM అవుతారు అంట కదా ” అని సన్నిహితులు జగన్ ని అడగటంతో అసలు జెసి దివాకర్ రెడ్డి మాటలు ఎవరు పట్టించుకుంటారు అని జగన్ జేసీ చేసిన వ్యాఖ్యలను లైట్ గా తీసుకున్నట్లు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Exit mobile version