ఎన్నికల్లో ఫేస్ రికగ్నేషన్ యాప్…! దొంగ ఓట్లకు చెక్…!

-

తెలంగాణలో జరగనున్న పురపాలక ఎన్నికలలో భాగంగా దొంగ ఓట్లు వేయకుండా ఉండేందుకుగాను ఫేస్ రికగ్నేషన్ యాప్ ని ప్రవేశపెడుతున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాదులోని కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10 పోలింగ్ కేంద్రాల్లో పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రవేశ పెడుతున్నామని పెర్కొందో. దీనికోసం ప్రత్యేక అధికారులును కూడా నియమిస్తున్నట్టు పేర్కొంది.

పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌తోపాటు వీడియో రికార్డింగ్ చేస్తామని చెప్పిన ఎన్నికల సంఘం, వెబ్‌ కాస్టింగ్ లేని పోలింగ్ కేంద్రాల వద్ద మైక్రో అబ్జార్వర్లు అందుబాటులో ఉంటారని వివరించింది. ఇదిలా ఉంటే ఎన్నికల నిర్వహణ కోసం 44వేల మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో ఉంటారని వారికి ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చామని చెప్పింది. ఈ ఎన్నికల్లో తెలుపు రంగు బ్యాలెట్ పేపర్‌ను వాడుతున్నట్లు చెప్పింది.

ప్రతి పోలింగ్ స్టేషన్‌లో ఇద్దరు యూనిఫామ్‌ పోలీసులు ఉంటారని, ఈ నెల 14వ తేదీ తర్వాత ఏకగ్రీవమైన వార్డులు, డివిజను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో విజయం కోసం రాజకీయ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అధికార తెరాస గెలిచి తన పట్టు నిలుపుకోవాలని భావిస్తుండగా, విపక్షాలు తెరాస ను దెబ్బ కొట్టాలని చూస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version