ముహూర్తం ఫిక్స్…వేదిక విశాఖే…” జగన్ అనే నేను” ఎప్పుడంటే..!

-

ఏపీలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ కొనసాగుతుండగా ఫ‌లితాల కోసం రాజ‌కీయ ప‌క్షాల‌తో పాటు అన్ని వ‌ర్గాల వారు ఎదురుచూస్తున్నారు.మే 13వ తేదీన పోలింగ్ జ‌ర‌గ్గా జూన్ 4వ తేదీన ఫ‌లితాలు వెల్ల‌డికానున్నాయి.ఓట‌ర్లు ఇచ్చిన తీర్పు ఈవిఎమ్ యంత్రాల‌లో భ‌ద్రంగా నిక్షిప్తం అయింది.ఇదిలా ఉండ‌గా సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రెండోసారి ప్ర‌మాణ స్వీకారానికి తేదీని ఖ‌రారు చేశారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి.

జూన్ 9వ తేదీన ఉద‌యం 9ః30 గంట‌ల‌కు ఆయ‌న ప్ర‌మాణం స్వీకారం చేస్తార‌ని వైవి ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఆయ‌న ప్ర‌క‌ట‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర ఉత్కంఠ‌ను రేపుతోంది. ఓట్ల‌ కౌంటింగ్ తరువాత ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ఏర్పాట్లు ప్రారంభిస్తారా లేక ముందుగానే చేస్తారా అనేది స‌స్పెన్స్‌గా ఉంది.అయితే ఇంత హడావుడిగా ప్రమాణస్వీకారం ప్రకటనలు చేయడం ఎందుకనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఎన్నికల ఫలితాలకు ఇంకా చాలా సమయం ఉన్న‌ప్ప‌టికీ ప్రమాణస్వీకార ముహూర్తాన్ని ప్రకటిస్తూ మళ్లీ తామే అధికారంలోకి రాబోతున్నామనే విషయాన్ని వైసిపి చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తోంది.

ఈ ఎన్నికల్లో కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమాతో వైసిపి నేత‌లు ఉండగా, వైసీపీ పాలనపై జనాలు విసుగెత్తిపోయారని, కచ్చితంగా టిడిపి, జనసేన ,బిజెపి కూటమి నే గెలిపిస్తారని , కూటమిలోని పార్టీలు ధీమాతో ఉన్నాయి. ఎవరికి వారు గెలుపు పై ఈ ధీమాను ప్రదర్శిస్తున్నారు.ఇలాంటి టైమ్‌లో వైసిపి మరో అడుగు ముందుకేసి జగన్ రెండో ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని కూడా ఖరారు చేసింది. ఇప్పటికే జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటన చేయడంతో, వైసిపి నాయకులు దీనికి అనుబంధంగా తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. కచ్చితంగా తము గెలుస్తామని, అందుకే జగన్ అంత ధీమా గా ఉన్నార‌ని, ప్రమాణ స్వీకారం విశాఖలో చేస్తామని మ‌రోసారి గుర్తు చేస్తున్నారు.ప్ర‌మాణ స్వీకారంపై వైవిసుబ్బారెడ్డి స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డంతో అటు వైసీపీ నేత‌ల్లో గెలుపు కాన్ఫిడెన్స్ మ‌రింత‌గా పెరిగిన‌ట్లైంది.

ఈ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ,జ‌న‌సేన‌,భార‌తీయ జ‌న‌తాపార్టీ కూటమి కూడా గెలుపు పై అంతే స్థాయిలో ధీమా క‌న‌బ‌రుస్తోంది.కానీ వైసిపి ముందుగానే ప్రమాణస్వీకారం రోజుతో పాటు, ముహూర్తాన్ని కూడా ఖరారు చేయడంతో, ఈ విషయంలో అంత తొందర ఎందుకు అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలను ఇంకా పూర్తిస్థాయిలో అంచనా వేయకుండానే తొందరపడి ముహూర్తంపై ప్రకటనలు చేయడం ఎందుకనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.ఏది ఏమైనా మ‌ళ్ళీ వైసీపీ అధికారంలోకి రానుంద‌ని ఈ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా తెలుస్తోంది.దీంతో సంక్షేమ ప‌థ‌కాలు ఎప్ప‌టిలాగే అమ‌లువుతాయ‌ని సామాన్యులు ఆనందం వ్య‌క్త‌ప‌రుస్తున్నారు.ముఖ్యంగా పెన్ష‌న్ తీసుకునే అవ్వాతాత‌లు సైతం సీఎంగా మ‌ళ్ళీ జ‌గ‌న్నే చూడాల‌నుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version