తెలంగాణలో కొత్త బ్రాండ్ల పై క్లారిటీ ఇచ్చిన మంత్రి..!

-

రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం ‘బ్రాండ్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఎక్సెజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఖండించారు. కొత్త బ్రాండ్ల కోసం ఎవరు దరఖాస్తు చేయలేదని, మేము పరిశీలించలేదని స్పష్టం చేశారు. మంగళవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన జూపల్లి.. గత ప్రభుత్వం చాలా శాఖల్లో బిల్లులు పెండింగ్ పెట్టిందని.. పెండింగ్ బిల్లుల వల్లే కంపెనీలు ఎక్కడైనా బీర్లు సప్లై చేయకపోయి ఉండవచ్చు తప్ప కృతిమ కొరత అనేది లేదన్నారు.

పొరుగు రాష్ట్రంలో చేసినట్లుగా తెలంగాణలో కూడా కొన్ని కొత్త బ్రాండ్లు పరిచయం చేసి వాటి ద్వారా భారీగా కమీషన్లు పొందేందుకు కొందరు ప్రభుత్వ పెద్దలు అనధికారికంగా కొత్త మద్యం పాలసీని రూపొందించారని, ఎన్నికల ఫలితాల అనంతరం కొత్త తరహా మద్యం దందా ప్రారంభం కాబోతున్నదని ఓ పత్రిక వెలువరించిన కథనాన్ని మంత్రి ఖండించారు. అసత్యాలు ప్రచురించిన సదరు పత్రికపై డిపార్ట్మెంట్ ద్వారా రూ.100 కోట్ల పరువు దావా వేయబోతున్నట్లు చెప్పారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున బకాలు పెట్టిందని ఈ పెండింగ్ బకాయిలకు బాధ్యులు ఎవరని మంత్రి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల మాటలు దొంగే దొంగ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టిస్తోందన్న ఆరోపణలపై స్పందిస్తూ.. మద్యం కొరత ఉంటే ప్రభుత్వానికే నష్టం తప్ప ప్రజలకు కాదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version