స్థానిక సంస్థల ఎన్నికల ముందే ఏపీ పీసీసీ చీఫ్ మాజీ కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి.. జగన్ పార్టీలో చేరడానికి మొత్తం రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అనంతపురం జిల్లా రాజకీయాల్లో కీలక రాజకీయ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో వివాదరహితుడిగా రఘువీరా రెడ్డి కి మంచి పేరు ఉంది. అయితే ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్ తనని సంప్రదించకుండా తన పదవిని శైలజానాధ్ కి ఇవ్వడంతో రఘువీరారెడ్డి దీన్ని అవమానంగా భావించి పార్టీలో నుండి బయటకు వచ్చినట్లు సమాచారం.
అంతేకాకుండా పార్టీలో తనకు ఓ మంచి పదవి ఇవ్వాలని కూడా వైసిపి సీనియర్ నాయకులను రఘువీరారెడ్డి కోరారట. దీంతో రఘువీరారెడ్డి కి, జగన్ ఒక కండిషన్ పెట్టినట్లు వైసీపీ పార్టీలో టాక్. విషయం ఏమిటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి రిజల్ట్ చూపించాలని అప్పుడు పదవి గురించి ఆలోచిద్దామని జగన్ చెప్పినట్లు పార్టీలో టాక్. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో రఘువీరారెడ్డి ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలి.