వైఎస్ జగన్ కి చాలా చాలా ఇష్టమైన పథకం లో అతిపెద్ద లొసుగు బయటపడింది .. ?

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తలపెట్టిన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో అదేవిధంగా ప్రజా సంకల్ప పాదయాత్ర లో రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద విద్యార్థి చదువుకునే విధంగా ప్రభుత్వం ఉంటుందని జగన్ హామీ ఇవ్వడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన వైయస్ జగన్ అదే స్థాయిలో సరికొత్త పథకాలు ప్రవేశపెడుతూ రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులకు చదువును కల్పిస్తున్నట్లు ప్రకటనలు ఇవ్వటం జరిగింది. ‘అమ్మఒడి’ మరియు ‘జగనన్న విద్యాదీవెన’ అదేవిధంగా ‘జగన్ అన్న వసతి దీవెన’ వంటి పథకాలను ఇటీవల ప్రకటించడం జరిగింది.

అమ్మ ఒడి పథకం కింద డైరెక్టుగా 15000 సదరు విద్యార్థి అమ్మాయి అకౌంట్ లోకి వెళ్ళటం ఈ పథకం ఒకటో తరగతి నుండి ఇంటర్ చదివే విద్యార్థులకు వర్తింప చేస్తున్నట్లు తెలపడం జరిగింది. అదే సమయంలో జగన్ అన్న వసతి దీవెన, జగనన్న విద్య దీవెన వంటి పథకాలకు కూడా ప్రభుత్వం నుండి ఆర్థికంగా సదరు విద్యార్థులు అకౌంట్లకు డబ్బులు జమ అవ్వడం జరిగింది. అయితే వైయస్ జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాలు ఆల్రెడీ గతంలో ఉన్నవే అని అతి పెద్ద దోచుకు ఇటీవల బయటపడింది. ఈ పథకాల గురించి ఇటీవల ఈ వార్త ఒకటి బయటపడింది.

 

అదేమిటంటే అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన విషయంలో జరుగుతున్నది ఇదే! ఒక్కసారిగా పెద్దమొత్తంలో డబ్బు ఇచ్చేసి…. భ్రమల్లో ముంచేసి… ప్రతినెలా పద్ధతిగా వాడుకునేందుకు ఉద్దేశించిన పథకాలను రద్దు చేశారు. ఈ పథకాలు లక్షలాది మంది విద్యార్థులకు శాపంగా మారాయి. ఆరు నుంచి ఇంటర్‌ వరకు చదివే విద్యార్థులకు అర్హతను బట్టి… స్కాలర్‌షిప్‌, కాస్మెటిక్‌ చార్జీలు, ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ ఇలా పలు పథకాలు వర్తించేవి. ఇప్పుడు వాటినే గజిబిజిగా మార్చి, గందరగోళపరిచి… అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెనగా అమలు చేస్తున్నారు. గతంలో ఇంట్లో ఉన్న అందరు విద్యార్థులకు వర్తించేవి. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చి కొత్త పేర్లు పెట్టి కుటుంబంలో కొంతమందికి వర్తింపజేస్తూ కలరింగ్ ఇస్తున్నారని ఇది చాలా మోసం అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version