వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు.. ముఖ్యమంత్రి జగన్ కు ఘన స్వాగతం పలికేందుకు వైజాగ్ ఎయిర్ పోర్ట్ కు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈసందర్భంగా భారీ జనసందోహాన్ని చూసిన జగన్ వాళ్లకు అభివాదం చేశారు.
సీఎం హోదాలో మొదటి సారి ఏపీ సీఎం జగన్ విశాఖలో పర్యటించారు. విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకోవడం సీఎం జగన్ వైజాగ్ వచ్చారు. విశాఖలో సీఎం జగన్ కు ఘన స్వాగతం లభించింది.
వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు.. ముఖ్యమంత్రి జగన్ కు ఘన స్వాగతం పలికేందుకు వైజాగ్ ఎయిర్ పోర్ట్ కు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈసందర్భంగా భారీ జనసందోహాన్ని చూసిన జగన్ వాళ్లకు అభివాదం చేశారు.
ఎయిర్ పోర్టులో ప్రజలకు అభివాదం చేసిన అనంతరం అక్కడి నుంచి శారదాపీఠానికి చేరుకున్నారు. శారదాపీఠం వద్ద జగన్ కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
సంప్రదాయ దుస్తులు ధరించిన జగన్.. స్వరూపానంద స్వామికి ఫలాలు సమర్పించారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు.
2017లో జగన్ పాదయాత్ర ప్రారంభించే సమయంలో కూడా స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. తర్వాత మళ్లీ సీఎం హోదాలో శారదాపీఠాన్ని జగన్ సందర్శించారు.
శారదా పీఠం వద్ద ఆశా వర్కర్లు జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆశావర్కర్ల జీతాలను 3 వేల నుంచి 10 వేలకు పెంచుతూ నిన్న సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.