వై ఎస్సార్ అప్పుడు చేసిన పని ఇప్పుడు కరోనా కి ఉపయోగపడుతోంది .. సూపర్ !

-

ప్రపంచాన్ని కకావికలం చేస్తుంది కరోనా వైరస్. ఈ వైరస్ వల్ల అమెరికా మరియు ఇటలీ అదేవిధంగా స్పెయిన్ దేశాలలో చాలా మంది జనాలు చనిపోతున్నారు. రోజురోజుకీ వైరస్ ప్రభావం ఎక్కువ అవటంతో ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ దేశాలలో మరణం విలయ తాండవం చేస్తుంది. ఇండియాలో కూడా ఉన్న కొద్ది వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ 21 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది.దీంతో చాలా వరకు జనాలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇటువంటి టైం లో చాలాచోట్ల క్వారంటైన్స్ వార్డులు ఏర్పాట్లు చేయడంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు స్థలం లేక నానా ఇబ్బందులు పడుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అటువంటి పరిస్థితుల్లో పెద్దగా ఏమీ లేవు. ముఖ్యంగా వైయస్ రాజశేఖర్రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో చేసిన ఒక పని ఇప్పుడు రాష్ట్రంలో కరోనా బాధితులకు ఉపయోగపడుతుంది. అదేమిటంటే వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో విశాఖపట్టణంలో ఐటి హబ్ మరియు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో సెజ్ లు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. బాగా అభివృద్ధి జరిగింది.

 

అదే సమయంలో విశాఖ ప్రజలతో పాటు ఉత్తరాంధ్రా, అటు ఒడిషా ప్రజలకు కూడా ఉపయోగంగా ఉండేలా నిమ్స్ తరహాలో విమ్స్  ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. అయితే ఆ తర్వాత ఆయన చనిపోవడం రాష్ట్రం విడిపోవడం తరువాత వచ్చిన ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు కరోనా వైరస్ విస్తృతంగా విస్తరిస్తున్న తరుణంలో వైఎస్ హయాంలో పునాది పడిన అదే విమ్స్ కరోనా వైరస్ బారిన పడిన వారికి పనికివస్తోంది. క్వారంటైన్స్ వార్డులు అక్కడే ఏర్పాటు చేసి రాష్ట్ర వైద్య బృందం చికిత్స అందిస్తున్నారు. దీంతో చాలా మంది విశాఖ వాసులు వైయస్ సూపర్ చచ్చిపోయినా గాని మామూలు ఈ విధంగా మమ్మల్ని బతికిస్తున్నాడు అని అంటున్నారు. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version