వైసీపీ సోషల్ మీడియా నూతన సారధి పై జగన్ ఫోకస్.. త్వరలోనే కొత్త వారికి బాధ్యతలు..

-

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.. పార్టీకి సంబంధించిన పోస్టులతో పాటు.. ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసేందుకు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని ప్రముఖంగా వాడుకునేది .. సోషల్ మీడియా ద్వారా వచ్చిన ప్రచారం వల్లే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిందనే అభిప్రాయాన్ని సొంత పార్టీ నేతలే వ్యక్తపరుస్తుంటారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. సజ్జల భార్గవ్ రెడ్డిని మీడియా ఇన్చార్జిగా అధినేత జగన్ నియమించారు.. ఐదేళ్లపాటు ఆయన పార్టీ కార్యక్రమాల్ని చురుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లారు.. 2024 లో జరిగిన ఎన్నికల్లో వైసిపి ఘోర ఓటమిని చవిచూసి అనంతరం.. మరో వ్యక్తిని ఇన్చార్జిగా పెట్టాలని వైసీపీ అధినేత భావిస్తున్నారట..

వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జి బాధ్యతలు నాగార్జున యాదవ్ కి అప్పగిస్తారని తొలుతా ప్రచారం నడిచింది.. అయితే అది కార్యరూపం దాల్చలేదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. చంద్రబాబు సర్కారుపై ప్రజల్లోని కొన్ని వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.. వైసీపీ శ్రేణులు పై తెలుగుదేశం పార్టీ నేతలు దాడులు చేస్తున్నారు.. వీటిని వైసీపీ సోషల్ మీడియా స్ట్రాంగ్ గా జనాల్లోకి పంపలేదనే అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లో వ్యక్తం అవుతుంది.. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వింగ్ కి నూతన సారధిని నియమించాలని అధినేత జగన్ భావిస్తున్నారట.. అందులో భాగంగా వైయస్ విజయమ్మ సోదరుడు సుదర్శన్ రెడ్డి అల్లుడు యశ్వంత్ రెడ్డి ని నియమించాలని జగన్ భావిస్తున్నారు.. సజ్జల భార్గవ్ రెడ్డి పర్యవేక్షణలోనే యశ్వంత్ రెడ్డి పని చేయబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి..

యశ్వంత్ రెడ్డికి సజ్జల భార్గవ్ అన్ని విధాల సహాయ సహకారాలు అందించబోతున్నారని.. వీరిద్దరి డైరెక్షన్లోనే వైసీపీ సోషల్ మీడియా పనిచేయబోతుందనే ప్రచారం జరుగుతుంది.. వీరిద్దరి కలయిక ద్వారానే తెలుగుదేశం పార్టీ చేసే వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లవచ్చనే భావన పార్టీలో వ్యక్తమౌతోంది.. సజ్జల భార్గవ్ రెడ్డి పనితీరు పట్ల జగన్మోహన్ రెడ్డి సంతృప్తిగా ఉన్న తరుణంలో.. ఆయన ఆధ్వర్యంలోనే యశ్వంత్ రెడ్డి పనిచేయబోతున్నారని తెలుస్తోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version