నేటి నుంచి ఢిల్లీలో వైసీపీ నిర‌స‌న‌… హైలైట్ కానున్న ఫోటో ఎగ్జిబిష‌న్‌

-

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులే టార్గెట్ గా దాడులు, హత్యలు జరుగుతున్నాయి. అటు శాంతి భద్రతలు కూడా అదుపు తప్పాయి. దీంతో వాటిని జగన్ సీరియస్‌గా తీసుకున్న జ‌గ‌న్ ఢిల్లీ వేదిక‌గా నిర‌స‌న చేసేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. ఏపీలో వైసీపీని టార్గెట్ గా చేసుకుని కూటమి ప్ర‌భుత్వం దాడులు చేస్తోంద‌ని జ‌గ‌న్ ఆరోపిస్తున్నారు,. వాటిని నిరోధించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విషయంలో కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ కలుగజేసుకునే విధంగా వ్యూహాన్ని ర‌చించారు జ‌గ‌న్‌. మూడు రోజుల ధ‌ర్నా నేప‌థ్యంలో ఆయ‌న త‌న బెటాలియ‌న్‌తో క‌లిసి ఇప్ప‌టికే ఢిల్లీ చేరుకున్నారు. స‌భా వేదిక వ‌ద్ద ఏర్పాట్లు కూడా పూర్త‌య్యాయి.

ఏపీలో ఎప్పుడూ లేని విధంగా శాంతి భద్రతలు అదుపుతప్పాయి. ముఖ్యంగా వినుకొండలో జ‌రిగిన‌ రషీద్ అనే యువకుడి హత్య అత్యంత దారుణం. అలాగే పుంగనూరులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డిపై జరిగిన రాళ్లదాడి వ్యవహారాన్నిఏపీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళారు జ‌గ‌న్. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 36 రాజకీయ హత్యలు జరిగాయని గవర్నర్ కు వివ‌రించారు. వీటిని నిరసిస్తూనే ఢిల్లీ వేదికగా పోరాటం చేసేందుకు జగన్ సిద్ధమయ్యారు. దేశ రాజధానిలో జరిగే ఈ పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాలంటూ విపక్ష పార్టీలకు జగన్ ఆహ్వానం పంపారు. ఏపీ పీసీసీ చీఫ్ ష‌ర్మిల‌కు సైతం అహ్వానం ప‌లికారు. అయితే త‌న అన్న చేప‌ట్టిన ధ‌ర్నాకు ష‌ర్మిల మ‌ద్ధ‌తు ఇవ్వ‌డం అనుమానంగానే ఉంది. ఇక త‌న పోరాట కార్యక్రమానికి అన్ని రాజ‌కీయ పార్టీల మద్దతు ఉండేలా జగన్ ప్లాన్ చేసుకున్నారు.

ఢిల్లీలో జ‌రిగే ఈ ధ‌ర్నా కోసం వైసీపీ కీలక నాయకులంతా ఇప్ప‌టికే హ‌స్తిన‌కు చేరుకున్నారు. మూడు రోజుల‌ పాటు ఢిల్లీలో జ‌రుగున్న ఈ ధ‌ర్నాను నేష‌న‌ల్ మీడియాకు చేరువ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా జ‌గ‌న్ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీలో గ‌త 50 రోజుల్లో జ‌రిగిన దారుణాల‌కు సంబంధించి ప్ర‌త్యేకంగా దీక్షాప్రాంగ‌ణంలో ఫోటో, వీడియో ఎగ్జ‌బిష‌న్ ఏర్పాటు చేస్తున్నారు. నేష‌న‌ల్ మీడియాలో హైలైట్ కావ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నారు జ‌గ‌న్. మూడురోజుల పాటు నిర‌స‌న చేప‌ట్టి ఆ త‌రువాత రాష్ట్ర‌ప‌తితో పాటు ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను ఆయ‌న క‌లిసేలా ప్లాన్ చేసుకున్నారు. ఏపీలో శాంతిభద్రతలను హైలెట్ చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని వైసీపీ ఎక్స్‌లో పేర్కొంది. మ‌రి జ‌గ‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యం ఏపీపై ఎలాంటి ప్ర‌భావం చూపిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version