యామినికి, లోకేశ్ కు మధ్య ఉన్న సంబంధం ఏంటి?

-

అప్పట్లో తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇలాగే టీఆర్ఎస్ పార్టీపై, సీఎం కేసీఆర్ పై, కేటీఆర్ పై విరుచుకుపడింది ఈమె. సోషల్ మీడియాలో ఈమె మాట్లాడే వీడియోలు చూస్తే ఒక్కటే అర్థమవుతుంది ఆమె చంద్రబాబు కీలుబొమ్మ అని.

సాదినేని యామిని ఎవరో మీకు తెలుసా? పేరు విన్నారా ఎప్పుడైనా? ఒక సంవత్సరం నుంచి ఆమె తెగ లైమ్ లైట్ లోకి వస్తోంది. సోషల్ మీడియాలో ఏ పార్టీని తిట్టాలన్నా.. గడగడా ఏ పార్టీనైనా విమర్శించాలన్నా ఆమె తర్వాతే ఎవరైనా? కంటిన్యూస్ గా ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. గంటలు గంటలు మాట్లాడుతుంది కానీ.. దాంట్లో కంటెంట్ ఏం ఉండదు. ఆమె మరెవరో కాదు.. టీడీపీ మహిళా నేత. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టును ఉన్నది ఉన్నట్టుగా మక్కీకి మక్కీ దించేస్తుంది. మొన్నటి ఎన్నికల దాకా వైఎస్సార్సీపీ పార్టీపై ఆమె ఎన్నోసార్లు నోరు జారింది. ఫేస్ బుక్ లో లైవ్ లోకి వస్తంది. వైఎస్సార్సీపీని, జగన్ ను విమర్శిస్తుంది.

అప్పట్లో తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇలాగే టీఆర్ఎస్ పార్టీపై, సీఎం కేసీఆర్ పై, కేటీఆర్ పై విరుచుకుపడింది ఈమె. సోషల్ మీడియాలో ఈమె మాట్లాడే వీడియోలు చూస్తే ఒక్కటే అర్థమవుతుంది ఆమె చంద్రబాబు కీలుబొమ్మ అని.

సరే.. ఆమె చంద్రబాబు కీలుబొమ్మ కాదనట్లేదు కానీ.. ఆమెకు, నారా లోకేశ్ బాబుకు ఉన్న సంబంధం ఏంటి. ఈ డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? మీకు వచ్చిందో లేదో కానీ.. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబుకు వచ్చింది.

ఆయన ఏమన్నారంటే.. కేవలం లోకేశ్ కోసమే యామిని మీడియా ముందుకు వచ్చి ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నదని ఆరోపించారు. అసలు లోకేశ్ కు, యామినికి మధ్య ఉన్న సంబంధం ఏంటి.. అంటూ కాస్త గట్టిగానే ఆయన ప్రశ్నించారు. యామిని తెగ ఆవేశపడుతూ.. ఆర్థం లేకుండా మాట్లాడుతుందని ఆయన ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ పై ఇష్టమున్నట్టు మాట్లాడితే బాగుండదని.. నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు కూడా.

కేవలం లోకేశ్ కోసమే యామిని మీడియా ముందుకు వచ్చి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నదని… యనమల కోసం కుటుంబరావు ముందుకొస్తున్నారని.. చంద్రబాబు కోసం ఎవరు వస్తారో అని సుధాకర్ బాబు ఎద్దేవా చేశారు. అంతే కాదు.. ఐటీ గ్రిడ్స్ అధినేత అశోక్, లోకేశ్ కు ఉన్న సంబంధం ఏంటో చంద్రబాబు చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటి వరకు లోకేశ్ ఎందుకు మీడియా ముందుకు వచ్చి ఐటీ గ్రిడ్స్ పై మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే వినండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version