టార్గెట్ లోకేష్ జోరుగా జరుగుతుండడంతో ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు విలవిల్లాడుతున్నారు.
రాజకీయంగా కష్టాల్లో ఉన్న విపక్ష తెలుగుదేశం పార్టీని ఇప్పుడు అధికార పార్టీ, పార్టీ మారే నేతలు లక్ష్యంగా చేసుకుని ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శల్లో ఇప్పుడు ఎక్కువగా వాళ్ళు లోకేష్ ని టార్గెట్ చేస్తున్నారు. ఆయన సామర్ధ్యాన్ని లక్ష్యంగా చేసుకుని మంత్రులు, పార్టీ మారాలని భావిస్తున్న వల్లభనేని వంశీ మోహన్ లాంటి టీడీపీ నేతలు కూడా పదే పదే విమర్శలు చేస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి కొడాలి నాని కూడా లోకేష్ ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు.
ఇక వల్లభనేని వంశీ అయితే లోకేష్ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో ఎదురు దాడి చేశారు. దీనిపై కార్యకర్తలు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీలో లోకేష్ సామర్థ్యంపై అనేక అనుమానాలు ఉన్నాయి. రాజకీయంగా ఆయన ఎంత వరకు రాణిస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. మంగళగిరిలో ఒక ఎమ్మెల్యే చేతిలో ఆయన ఓడిపోవడంతో అనేక ప్రశ్నలు వినపడుతున్నాయి.
మరి ఇలా ప్రతీ ఒక్కరు లోకేష్ ని టార్గెట్ చేయడంతో చంద్రబాబు ఏ విధంగా ముందుకి వెళ్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే లోకేష్ వ్యవహారశైలితో పార్టీలో యువనేతలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఆయన తన బాధ్యతలను దాటి కొత్త విషయాల్లో వేలు పెడుతున్నారు అనే అసహనం కూడా వారిలో ఎక్కువగా వ్యక్తమవుతుంది. అందుకే చంద్రబాబు… ఇప్పుడు కొన్నాళ్ళు లోకేష్ ని పక్కన పెట్టాలని భావిస్తున్నారట.
ఆయనను పలు మీడియా సమావేశాలకు కూడా దూరంగా ఉంచడమే కాకుండా మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు రామ్మోహన్ నాయుడుకి పగ్గాలు అప్పగించాలి అనే ఆలోచన చంద్రబాబు చేస్తున్నారట. ఇదే విషయమై కుటుంబంలో కూడా ఎక్కువగానే చర్చ జరుగుతుందని పార్టీ వర్గాల్లో వినపడుతుంది. ఇక లోకేష్ విషయంలో యువనేతల్లో ఉన్న అసహనం కూడా కొంత వరకు తగ్గుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు లోకేష్ వ్యవహారం పార్టీలో ఇబ్బందికరంగా మారింది.