రోజూ మున‌గాకు తింటే క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!

-

మున‌గ‌కాయ‌ల‌తో మ‌నం అనేక రకాల కూర‌ల‌ను చేసుకుని తింటుంటాం. ఇవి మ‌న‌కు చ‌క్క‌ని రుచిని మాత్ర‌మే కాదు, అనేక పోష‌కాల‌ను కూడా అందిస్తాయి. మున‌గ‌కాయ‌ల‌తో ఏ కూర చేసినా చాలా మంది ఇష్టంగానే తింటారు. అయితే నిజానికి మున‌గ‌కాయ‌ల క‌న్నా మున‌గ ఆకుల‌ను తింటే ఇంకా మ‌న‌కు ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మున‌గ ఆకుతో కూర చేసుకుని తిన‌వ‌చ్చు. లేదా జ్యూస్ రూపంలో తీసుకోవ‌చ్చు. ఎలా తీసుకున్నా స‌రే.. మున‌గ ఆకు మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మున‌గ ఆకుల్లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. అందువ‌ల్ల శరీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే ఆ ఆకులో ఉండే విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది. అందులో ఉండే ఐర‌న్ రక్త‌హీన‌త‌ను పోగొడుతుంది.

2. మున‌గ ఆకుల్లో ఉండే కాల్షియం మ‌న శ‌రీరంలో ఎముక‌లు, దంతాల‌ను దృఢంగా చేస్తుంది.

3. మున‌గ ఆకును రోజూ తీసుకుంటే క్యాన్స‌ర్ రాకుండా చూసుకోవ‌చ్చ‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి.

4. బాగా త‌ల‌నొప్పిగా ఉంటే మున‌గ ఆకు ర‌సాన్ని తాగితే వెంట‌నే త‌ల‌నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

5. మ‌ధుమేహం ఉన్న‌వారు మున‌గ ఆకు ర‌సాన్ని రోజూ తాగితే బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version