టీడీపీలోకి ‘ఫ్యాన్’ ఎమ్మెల్యేలు..ట్విస్ట్ ఏంటంటే?

-

ఏపీలో రివర్స్ రాజకీయం మొదలయ్యేలా ఉంది..ఇంతవరకు టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు జరిగాయి..ఇకపై వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు జరగనున్నాయని విశ్లేషణలు వస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది నేతలు టీడీపీలోకి వచ్చేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పుడే జంప్ చేసేందుకు నేతలు రెడీగా లేరని, ఇంకా అధికారం ఉంది కాబట్టి…ఎన్నికల ముందు జంప్ చేస్తే బెటర్ అని కొందరు నేతలు ఆలోచిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

ysrcpandtdp

గతంలో అలాగే ఎన్నికల ముందు చాలామంది టీడీపీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీలో చేరిన విషయం గుర్తు చేస్తున్నారు. అంతకముందు వరకు వైసీపీ వాళ్ళు…టీడీపీలో చేరారు. కరెక్ట్ గా ఎన్నికల ముందు కొందరు వైసీపీలో చేరిపోయి విజయాలు సాధించారు. టీడీపీపై వ్యతిరేకత పెరగడం, పైగా సీటు దక్కదు ఏమో అనే డౌట్ తో కొందరు టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చారు. ఇప్పుడు కూడా అదే పరిస్తితి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఎలాగో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వరకు సమయం ఉంది..దీంతో ఇప్పుడు జంప్ అవ్వడం వల్ల ఉపయోగం ఉండదని, పైగా వైసీపీ నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని ఆలోచిస్తున్నారు.

ఎన్నికల ముందు మాత్రం టికెట్ దక్కని ఎమ్మెల్యేలు మాత్రం ఖచ్చితంగా పార్టీ మారడానికే చూస్తారని తెలుస్తోంది. ఇప్పటికే సరైన పనితీరు కనబర్చని ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వనని చెప్పేశారు. 150 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 50 మంది వరకు మళ్ళీ సీటు దక్కే అవకాశాలు లేవని సర్వేలు కూడా చెబుతున్నాయి. కాబట్టి అలా సీటు కోల్పోయిన వారు…ముందు గానే సీటు రాదనే విషయం పసిగడితే…టీడీపీలోకి వెళ్ళే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అదేవిధంగా ఇద్దరు, ముగ్గురు ఎంపీలు కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అంటే ఎన్నికల ముందే వైసీపీ నుంచి టీడీపీలోకి జంపింగులు ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో టీడీపీ నుంచి వైసీపీలోకి కూడా జపింగులు ఉండే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version