2024 లోక్ సభ ఎన్నికలు దేశ వ్యాప్తంగా మొత్తం 7 విడతల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు(మే 13) మొత్తం 10 రాష్ట్రాల్లోని 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.దేశవ్యాప్తంగా 62.31 శాతం పోలింగ్ నమోదైంది.ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు , 25 పార్లమెంట్ స్థానాలకు గాను ఎన్నికలు జరిగాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
ఇక ఈ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ జూన్ 1న వెలువడనున్నాయి. దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ సమయంలో అన్ని దశల పోలింగ్ తర్వాతే ఇవి రిలీజ్ అవుతాయి. ముందుగా విడుదల చేస్తే మిగతా ఫేజ్ల ఎన్నికలు ప్రభావితం అవుతాయనే కారణంతో ఎగ్జిట్ పోల్స్పై ఈసీ ఆంక్షలు విధిస్తుంది. ప్రస్తుతం 4వ దశ ఎన్నికలు పూర్తి కాగా జూన్ 1న చివరిదైన 7వ దశ పోలింగ్ జరగనుంది. దీంతో అదే రోజు సాయంత్రం 6.30 నుంచి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడతాయి.