పాలీసెట్-2025 పరీక్షకు సర్వం సిద్ధం..

-

పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష పాలీసెట్-2025 మే 13వ తేదీన (మంగళవారం) ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరగనుంది. ఈ పరీక్ష ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలలోని మూడేళ్ల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమాలలో ప్రవేశం లభిస్తుంది. అధికారులు పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ సంవత్సరం పాలీసెట్‌కు మొత్తం 1,06,716 మంది విద్యార్థులు హాజరవుతుండగా, 276 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది. విద్యార్థులు ఉదయం 10:00 గంటలకే హాలులోకి ప్రవేశించి, OMR షీట్‌పై అవసరమైన వివరాలు పూరించాలి. పరీక్ష ప్రారంభమైన అనంతరం ఒక నిమిషం ఆలస్యం అయినా హాజరయ్యే విద్యార్థిని అనుమతించరు.

 

విద్యార్థులు తప్పనిసరిగా HB బ్లాక్ పెన్సిల్, ఎరేసర్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ తీసుకురావాలి. హాల్ టికెట్‌పై ఫోటో కనిపించని అభ్యర్థులు తప్పనిసరిగా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు తీసుకురావాలి. సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రాల్లో అనుమతించబడవు. ఇంజనీరింగ్ కోర్సు కోసం గణితం 60 మార్కులు, భౌతిక శాస్త్రం 30, రసాయన శాస్త్రం 30 మార్కులకు పరీక్ష ఉంటుంది. వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ కోర్సులకు అభ్యర్థులు అదనంగా జీవశాస్త్రం 30 మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రం స్థానాన్ని గుర్తించేందుకు విద్యార్థులు SBTET TG అనే యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని, అందులో POLYCET Exam Center Locator టాబ్‌ను ఓపెన్ చేయాలి. హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే కేంద్ర వివరాలు, గూగుల్ మ్యాప్ ద్వారా దూరం, మార్గం లభిస్తాయి. ఇది సమయానికి పరీక్షా కేంద్రానికి చేరేందుకు ఎంతో ఉపయోగపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news